ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..
Breaking News
మెట్ గాలాలో రూ. 142 కోట్ల నెక్లెస్‌తో మెరిసిన సుధా రెడ్డి..!
Published on Tue, 05/05/2026 - 18:08
న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో మెట్‌గాలా 2026 వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో సెలబ్రెటీలు, ప్రముఖులు, ఇతరులు తమదైన శైలితో కళాత్మకంగా మెరిశారు. ఈసారి మన హైదరాబాద్ బిలియనీర్, MEIL(Megha Engineering and Infrastructures Limited) గ్రూప్ డైరెక్టర్లో ఒకరైన సుధారెడ్డి అద్భుతమైన లుక్‌లో అలరించారు.
ఈ వేడుకలో ఆమె మనీష్ మల్హోత్రా దుస్తులను ఎంచుకున్నారు. ఆమె ఈ ఈవెంట్లో 'కాస్ట్యూమ్ ఆర్ట్' అనే థీమ్‌కు అనుగుణంగా ధరించిన మిలియన్ డాలర్ల నెక్లెస్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఈ నెక్లెస్ ఆమె వ్యక్తిగత ఆభరణాల కలెక్షన్లలో ఒకటి. దీని ఖరీదు వచ్చేసి దాదాపు 142 కోట్లు పైనే పలుకుతుందట. ఈ ఆభరణం త్రిభుజాకార రోజ్-కట్ వజ్రాలతో కూడిన విక్టోరియన్-ఫినిష్ చైన్‌తో రూపొందించారు. పూల గుత్తులలో పొదిగిన ఈ రత్నాలు, నెక్లెస్ మధ్యలో ఉన్న 550 క్యారెట్ల ముదురు ఊదా-నీలం రంగు టాంజనైట్ ఈ నెక్లెస్ అందాన్ని మరింత హైలెట్ చేశాయి.
ఈ నెక్లెస్‌ని 'క్వీన్ ఆఫ్ మెరెలానీ' అని పిలుస్తారట. ఈ ఆభరణంతోపాటు 30 క్యారెట్ల రోజ్-కట్ పోల్కీ వజ్రపు ఉంగరం, 40 క్యారెట్ల అస్చెర్-కట్ కొలంబియన్ పచ్చ ఉంగరంతో సుధారెడ్డి తన ఆహార్యాన్ని పూర్తి చేశారు. ఇక మనీస్ మల్హోత్రా డిజైన్ చేసినా ఆమె డ్రెస్ 'జీవ వృక్షం', కాలం, జ్ఞాపకం, నిరంతర ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచింది. ఇందులోని ప్రతిదారం చరిత్రలో ఒక భాగాన్ని వివరించే అద్భుతమైన కళ.
అన్నింటకంటే ఆ డిజైనర్‌వేర్‌లో ఏకంగా మూడువేల ఏళ్ల వస్త్ర సంప్రదాయాన్ని అల్లికలు, ఎంబ్రాయిడరీ ద్వారా చూపించినట్లు పేర్కొన్నారు మల్హోత్రా. అందులో పాలపిట్ట, జమ్మి చెట్టు, కల్పవృక్ష, టాంగేడు, సూర్య, చంద్ర తదితర మూలాంశాలన్నీ ఈ డ్రెస్‌ను మరింత అందంగా కనిపించేలా చేశాయి. కాగా సుధారెడ్డి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తన మెట్ గాలా లుక్ గురించి ఇలా షేర్ చేసుకున్నారు.
"హైదరాబాద్ కేవలం తన పుట్టినిల్లు మాత్రమే కాదు, అది తనలో భాగమైన జీవన విధానం. తాను ఈ వేడుకలో ప్రపంచ వేదికపై దక్షిణ భారతీయతను కళ్లకు కట్టినట్లు చూపించేలా..అత్యంత ఆకర్షణీయంగా కనిపించాలని ఆకాంక్షించినట్లు వెల్లడించారు". కాగా, సుధా రెడ్డికి MEIL (Megha Engineering and Infrastructures Limited) మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డితో వివాహం జరిగింది. ఆ దంపతులకు మానస్, ప్రణవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
(చదవండి: ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..)
Tags : 1