ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..
Breaking News
45 ఏళ్లకే రిటైర్ అవ్వొచ్చా? చాట్ జీపీటీ రెస్పాన్స్
Published on Tue, 05/05/2026 - 17:05
వేగవంతమైన జీవనశైలిలో 60 ఏళ్ల వరకు పనిచేయడం అనేది ఒకప్పుడు సాధారణం. కానీ, ఇప్పటి యువతరం 40 ఏళ్లకే ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటోంది. 30 ఏళ్ల యువకుడు నెలకు రూ.1.5 లక్షల ఆదాయంతో ముంబై వంటి నగరంలో ఉంటూ 45 ఏళ్లకే పదవీ విరమణ ఎలా చేయాలి? ఈ ప్రశ్నపై ఏఐ దిగ్గజం చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అత్యంత సంక్లిష్టమైన ఆర్థిక లెక్కల కంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలియే ముందస్తు పదవీ విరమణకు కీలమని ఏఐ స్పష్టం చేస్తోంది.
పెట్టుబడి కంటే పొదుపే ముఖ్యం!
త్వరగా రిటైర్ అవ్వాలంటే చాలామంది ఏ మ్యూచువల్ ఫండ్ బాగుంటుంది? ఏ స్టాక్‌లో లాభాలు వస్తాయి? అని వెతుకుతుంటారు. కానీ, చాట్ జీపీటీ ఇచ్చిన సలహా ఆశ్చర్యకరంగా ఉంది. దీని ప్రకారం, ముందస్తు పదవీ విరమణకు పెట్టుబడి రాబడి ముఖ్యం కాదు, ఎంత పొదుపు చేస్తున్నామనేదే కీలకం.
ఏఐ సూచించిన ప్రాథమిక సూత్రం
60:40 నిష్పత్తి: ఉదాహరణకు నెలకు వచ్చే మీ రూ.1.5 లక్షల ఆదాయంలో రూ.60,000 మాత్రమే ఖర్చు చేయాలి. మిగిలిన రూ.90,000ను కచ్చితంగా పెట్టుబడిగా మార్చాలి.
ముంబైలో జీవనశైలి పెరిగే ప్రమాదం ఉంది. ఎంత జీతం పెరిగినా ఆ అదనపు మొత్తాన్ని కూడా పెట్టుబడికే మళ్లించాలని ఏఐ సూచిస్తోంది.
కేవలం డబ్బు దాచడమే కాకుండా దానిని సరైన మార్గాల్లో మళ్లించడం ద్వారా 15 ఏళ్లలో మెరుగైన కార్పస్‌ను నిర్మించవచ్చని ఏఐ విశ్లేషించింది.
| విభాగం | నెలవారీ కేటాయింపు | సూచన |
|---|---|---|
| ఈక్విటీ/ఇండెక్స్ ఫండ్స్ | రూ. 75,000 | దీర్ఘకాలిక కాంపౌండింగ్ కోసం డైరెక్ట్ ప్లాన్లను ఎంచుకోవాలి. |
| డెట్/ఎమర్జెన్సీ ఫండ్ | రూ. 15,000 | లిక్విడ్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఆర్థిక భద్రత. |
| నిర్వహణ వ్యయం | రూ. 60,000 | అద్దె, ఆహారం, బీమా, ఇతర ఖర్చులు. |
సెబీ నిబంధనల ప్రకారం, రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్స్ ఖర్చు తక్కువ. కాబట్టి లాభాలు ఎక్కువగా ఉంటాయని ఏఐ గుర్తుచేస్తోంది.
వ్యూహాత్మక మార్పు
ముంబైలో పెరుగుతున్న జీవన వ్యయం మీ పొదుపు లక్ష్యానికి అతిపెద్ద అడ్డంకి. కాబట్టి 45 ఏళ్ల వయసులో పదవీ విరమణ తర్వాత ముంబై నుంచి ప్రశ్న అడిగిన వ్యక్తి స్వస్థలమైన లఖ్‌నవూకు మారిపోవాలనే ఆలోచన చాలా తెలివైనదని ఏఐ అభినందించింది. లఖ్‌నవూలో నివసించడం వల్ల జీవన వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఇది మీ కార్పస్ మరింత కాలం మన్నేలా చేస్తుంది.
చాట్ జీపీటీ మాటల్లో చెప్పాలంటే, 10 నుంచి 15 ఏళ్ల పాటు డబ్బు విషయంలో కాస్త విసుగుగా అనిపించినా సరే, క్రమశిక్షణ తప్పకూడదు. ఏఐ చెబుతున్న ఈ పద్ధతిని పాటిస్తే మీ 45వ ఏట ఆర్థిక స్వేచ్ఛను పొందడం అసాధ్యమేమీ కాదు. అయితే, పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయని, ఏదైనా పెట్టుబడికి ముందు ఆర్థిక సలహాదారుడిని సంప్రదించడం ఉత్తమమని గుర్తుంచుకోండి.
ఇదీ చదవండి: ఇండియన్స్ నిజంగా గ్రేట్!
Tags : 1