ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..
Breaking News
విజయ్ గెలుపు వెనక.. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ముద్ర..!
Published on Tue, 05/05/2026 - 16:51
ప్రస్తుతం ఎక్కడా చూసిన విజయ్ పేరే వినిపిస్తోంది. తమిళనాట మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ గెలుపు గురించి చర్చించుకుంటున్నారు. ఈ అసాధారణ విజయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ హీరోలు సైతం దళపతికి అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రవితేజ, నాని లాంటి స్టార్స్ కూడా విజయ్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో గెలుపు వెనక ఎవరెవరు కృషి చేశారా అన్న విషయాలంపై చర్చ నడుస్తోంది.
ఈ విజయంలో ముఖ్యంగా విజయ్‌కు ఉన్న క్రేజ్ ఒక కారణం అయినప్పటికీ.. మరెన్నో సానుకూల అంశాలున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంగ్స్ కూడా ప్రత్యేక పాత్ర పోషించనట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారాల్లో పాటలు కూడా గూస్బంప్స్ తెప్పించేలా ఉంటాయి. పొలిటికల్ సాంగ్స్‌కు మ్యూజిక్ కంపోజ్ చేయడం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
అయితే విజయ్ అరంగేట్ర ప్రచారంలో వచ్చిన సాంగ్స్ అభిమానులను, ఓటర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్స్‌కు టాలీవుడ్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించడం మరో విశేషం. టాలీవుడ్లో బీజీఎం కింగ్ పేరున్న తమన్యువతను ఆకట్టుకునేలా రూపొందించిన మూడు ప్రచార పాటలను కంపోజ్ చేశారు. అప్పట్లో ఈ సాంగ్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. విజయ్ కోసం తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేలా చేశాయి. దీంతో విజయ్ విజయం వెనక తమన్ మ్యూజిక్ పాత్ర కూడా ఉందని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Tags : 1