Breaking News

ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు NHAI హెచ్చరిక!

Published on Sun, 05/03/2026 - 15:28

భారతదేశంలో టోల్ వసూలు విధానాన్ని సులభతరం చేయడానికి ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థ ఫాస్ట్‌ట్యాగ్ (FASTag). ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. వాహనం టోల్ ప్లాజా దగ్గరకు చేరుకున్నప్పుడు, FASTag లోని చిప్‌ను స్కాన్ చేసి టోల్ చార్జీలు ఆటోమేటిక్‌గా వాహన యజమాని ఖాతా నుంచి కట్ అవుతుంది. దీనివల్ల నగదు చెల్లింపుల అవసరం తగ్గి, ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది.

అయితే.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మార్గదర్శకాల ప్రకారం, ఫాస్ట్‌ట్యాగ్‌ను తప్పనిసరిగా వాహనం ముందు విండ్‌స్క్రీన్‌పై అతికించాలి. కానీ కొందరు వాహనదారులు దాన్ని చేతిలో పట్టుకొని స్కాన్ చేయిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ విషయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడించింది.

విండ్‌స్క్రీన్‌పై ఫాస్ట్‌ట్యాగ్‌ను అమర్చడం వల్ల.. టోల్ గేట్ల వద్ద సులభంగా స్కాన్ అవుతుంది. వాహనాలు ఆగకుండా ముందుకు సాగుతాయి. తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ను పలు వాహనాల్లో ఉపయోగించే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్‌ను సరిగ్గా అమర్చకపోతే దానిని బ్లాక్ చేయనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ హెచ్చరించింది.

ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ మోసం!
ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌లను విక్రయిస్తున్నట్లు చెప్పుకునే నకిలీ వెబ్‌సైట్‌లు, అనధికారిక లింక్‌ల పట్ల జాగ్రత్త వహించాలని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. ఈ పాస్‌లు కేవలం అధికారిక రాజమార్గయాత్ర యాప్ ద్వారా మాత్రమే లభిస్తాయి. ఈ పాస్‌లను విక్రయించే అధికారం ఇతర ఏ ప్లాట్‌ఫామ్‌లకు లేదు. ఇతర నకిలీ ప్లాట్‌ఫామ్‌లను నమ్మితే.. ఆర్థిక మోసానికి లేదా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి దారితీయవచ్చు. అప్రమత్తంగా ఉండండి. తెలియని లింక్‌లను నమ్మకూడదని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది.

ఇదీ చదవండి: ట్రంప్ లేటెస్ట్ పోస్ట్.. వచ్చేవారం నుంచి కొత్త సుంకాలు!

#

Tags : 1

Videos

మంత్రి టీజీ భరత్ అనుచరుడు వేధింపులకు యువకుడు బలి

వెరీ సాడ్.. ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం.. AI వీడియో..

స్టాఫ్ చేతులు కట్టేసి.. సంచుల నిండ బంగారంతో పరార్..

ఇంట్లో మొగుడు.. ఫోన్లో ప్రియుడు.. కొంపముంచుతున్న డేటింగ్ యాప్‌లు..

అయ్యో పాపం.. సాయి పల్లవి.. మొదటి అడుగే ఇలా అయ్యిందేంటి?

పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఖతం.. దురంధర్ పనేనా..?

ఒక్కటైన పాత మిత్రులు..

కరీంనగర్ జువెల్లరీ షాప్ లో దోపిడీ Live వీడియో

YSRCP నేత దశరథరామిరెడ్డితో పాటు పలువురిపై మంత్రి అనుచరుల దాడి

ఘటనకు ముందు నేను అక్కడే ఉన్న? కాల్పులపై బండి సంజయ్ రియాక్షన్

Photos

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)

+5

కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 03-10)

+5

నిర్మాత కూతురి పెళ్లి రిసెప్షన్‌లో టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

రోజురోజుకీ మరింత అందంగా కాజల్ అగర్వాల్ (ఫొటోలు)

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

+5

తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)