Breaking News

కారు.. టాప్‌ గేరు!

Published on Sat, 05/02/2026 - 05:49

ముంబై: దేశీయ కార్ల తయారీ సంస్థలు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా వంటి సంస్థల రికార్డు స్థాయి విక్రయాల కారణంగా,  ఏప్రిల్‌లో దేశీయ మార్కెట్లో 4.5 లక్షల ప్యాసింజర్‌ వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది(2025) ఇదే నెల అమ్ముడైన 3.54 లక్షల ప్యాసింజర్‌ వాహనాలతో పోలిస్తే ఇవి 27% అధికంగా ఉన్నాయి. జీఎస్‌టీ 2.0 అమలుతో నెలకొన్న సానుకూల పరిస్థితులు, ఆర్‌బీఐ రెపో రేట్ల తగ్గింపు, ఆదాయ పన్ను రాయితీ అంశాలతో వాహన పరిశ్రమకు ప్రయోజనం చేకూరిందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ తెలిపారు. 

→ మారుతీ సుజుకీ దేశీయ అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది డిసెంబర్‌ నాటి 1,82,165 యూనిట్ల గరిష్ట స్థాయి అధిగమిస్తూ.. ఈ ఏప్రిల్‌లో 1,91,122 వాహనాలను విక్రయించింది. గత ఏప్రిల్‌తో (1,42,053 యూనిట్లు) పోలిస్తే వృద్ధి 34.54 శాతంగా నమోదైంది. ప్రస్తుతం మారుతీ వద్ద 1.65 లక్షల బుకింగ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి.  

→ మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎం అండ్‌ ఎం) ఏప్రిల్‌లో దేశీయంగా 56,331 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన 52,330 వాహనాలతో పోలిస్తే ఇవి 8% అధికంగా ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం (2026–27) ‘సానుకూల దృక్పథం’తో ప్రారంభమైందని సంస్థ ఆటోమోటివ్‌ విభాగం సీఈఓ నళినీకాంత్‌ గొల్లగుంట తెలిపారు. 

→ టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌(టీఎంపీవీ) అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 30.5% పెరిగి 45,199 నుంచి 59,000 యూనిట్లకు చేరాయి. 

→ ప్రభుత్వ పాలసీ మద్దతుతో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఏప్రిల్‌ 2026లో 17% వార్షిక వృద్ధితో దేశీయంగా 51,902 యూనిట్ల 
విక్రయాలు జరిపింది. సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఏప్రిల్‌ నెలలో నమోదైన అత్యధిక అమ్మకాలు ఇవే.  

→ కియా ఇండియా ఏప్రిల్‌లో 16% వృద్ధితో అదరగొట్టింది. గతేడాది ఏప్రిల్‌లో 23,623 యూనిట్లు అమ్ముడవగా.. ఈసారి 27,286 వాహనాలతో సంస్థ చరిత్రలోనే అత్యధిక ఏప్రిల్‌ విక్రయాలను నమోదు చేసింది.

→ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ 21 శాతం వృద్ధితో సత్తా చాటింది. గతేడాది ఏప్రిల్‌లో 24,833 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య 30,159కి చేరింది. 

→ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా ఈ ఏప్రిల్‌లో 3 శాతం వృద్ధితో 6,018 వాహనాలను డీలర్లకు పంపింది. 

→ రెనో ఇండియా అమ్మకాల్లో ఏకంగా రెండింతల వృద్ధిని నమోదు చేసింది. గతేడాది 2,602 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య 5,413కి చేరింది. 

→ నిస్సాన్‌ మోటార్‌ ఇండియా దేశీయ విక్రయాలు 3,203 యూనిట్లుగా నమోదయ్యాయి.

Videos

సొంత టీడీపీ కార్యకర్తపైనే... ప్రశ్నించాడని పోలీసులతో ఈడ్చుకెళ్లి.. బండారు శ్రావణి రెడ్ బుక్ రూల్

ఒక అచ్చోసిన ఆంబోతు మాటలకు మీ పదవులను ఊడగొట్టకపోతే.. జడ శ్రవణ్ ఛాలెంజ్

ORR కారు ప్రమాదం.. ఎలా జరిగిందంటే?

బిల్డింగ్ అద్దాల కోసం 2 వేల కోట్లు.. మనిషివేనా..! చంద్రబాబును ఏకిపారేసిన కారుమూరి

అనిత, సంధ్యారాణిని చూస్తే.. మహానటి సావిత్రి మళ్లీ పుట్టారా అనిపిస్తుంది..

నన్ను ఎందుకు ఇలా తిప్పుతున్నారో నాకే అర్ధం కావట్లేదు.. రిలీజ్ తర్వాత శ్రీహరి రియాక్షన్

ORRపై ప్రమాదం ఎలా జరిగిందో చూడండి.. AI Video

ఖమ్మం రాము మర్డర్ కేసులో చిన్న కూతురు రితిక మృతి

బెడ్ పై మహిళతో CI.. బెడ్ రూమ్ వీడియో వైరల్..

వాహనదారులకు బిగ్ షాక్.. త్వరలో పెట్రో బాదుడు!

Photos

+5

హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్‌ (ఫొటోలు)

+5

ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో వరలక్ష‍్మి శరత్‌కుమార్‌ (ఫొటోలు)

+5

గ్లామర్ ఓవర్‌లోడెడ్.. మెరిసిపోతున్న కియారా (ఫొటోలు)

+5

సెలబ్రేషన్స్, డివోషనల్ ట్రిప్స్.. అల్లు స్నేహ ఏప్రిల్ గడిచిందిలా (ఫొటోలు)

+5

కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి..ఎందుకో తెలుసా? (ఫొటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి HD ఫొటోలు