ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్
Breaking News
యాపిల్ గ్యాడ్జెట్‌తో ఐ ఆపరేషన్
Published on Thu, 04/30/2026 - 12:07
సాంకేతిక ప్రపంచంలో ఒకప్పుడు కేవలం విలాసవంతమైన గ్యాడ్జెట్‌గా భావించిన ‘యాపిల్ విజన్ ప్రో’ ఇప్పుడు ప్రాణాలను రక్షించే, చూపును ప్రసాదించే వైద్య విభాగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకించి కంటి శస్త్రచికిత్సల్లో ఈ స్పేషియల్ కంప్యూటింగ్ పరికరాన్ని వైద్యులు విజయవంతంగా ఉపయోగిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కంటిశుక్లం ఆపరేషన్లలో..
న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ ఎరిక్ రోసెన్‌బర్గ్, ఈ గ్యాడ్జెట్‌ను శస్త్రచికిత్సా పరికరంగా ఉపయోగించారు. 2025 చివరి నాటికి ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ ప్రక్రియ ఇప్పుడు సాధారణంగా ఉపయోగంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా కంటిశుక్లం (కాటరాక్ట్) శస్త్రచికిత్సల్లో దీని వినియోగం మెరుగైన ఫలితాలను ఇస్తోంది.
‘స్కోప్ ఎక్స్ ఆర్’ పనితీరు
ఈ సాంకేతికత నేరుగా ఆపరేషన్ గదిలోని సర్జికల్ మైక్రోస్కోప్‌తో అనుసంధానించబడి ఉంటుంది. మైక్రోస్కోప్ నుంచి వచ్చే ప్రత్యక్ష దృశ్యాలను హై-రిజల్యూషన్ 3డీ నాణ్యతతో సర్జన్ కళ్ల ముందు ఉంచుతుంది. శస్త్రచికిత్స జరుగుతుండగానే రోగి పాత స్కాన్ రిపోర్టులు, కీలక డేటాను సర్జన్ తన చూపును పక్కకు తిప్పకుండానే హెడ్‌సెట్ స్క్రీన్‌పై చూసుకోవచ్చు. మానిటర్ల వైపు చూడటానికి పదేపదే తల తిప్పాల్సిన అవసరం లేకపోవడంతో సర్జన్ పూర్తి ఏకాగ్రత రోగి కంటిపైనే ఉంటుంది.
‘ఇది ఉన్న పరికరాలను తొలగించదు. కానీ ఇప్పటికే ఉన్న వ్యవస్థను మరింత సమర్థవంతంగా మారుస్తుంది. సమాచారం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా అది అంతా మన కళ్ల ముందే ప్రత్యక్షమవ్వడం అద్భుతం’ అని డాక్టర్ ఎరిక్ రోసెన్‌బర్గ్ చెప్పారు.
రిమోట్ సహకారం
విజన్ ప్రో ద్వారా మరో కీలక ప్రయోజనం ‘రిమోట్ కొలాబరేషన్’. ఒక క్లిష్టమైన ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ప్రపంచంలోని ఏ మూలన ఉన్న నిపుణుడైనా వర్చువల్‌గా ఆపరేటింగ్ థియేటర్‌లోకి ప్రవేశించవచ్చు. సర్జన్ ఏం చూస్తున్నారో అదే దృశ్యాన్ని రిమోట్ తీసుకున్న నిపుణుడు కూడా చూస్తూ రియల్‌టైమ్‌లో సూచనలు ఇచ్చే వీలుంటుంది. ఇది వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో, క్లిష్టమైన కేసులలో సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది.
సవాళ్లు
వైద్య రంగంలో మిశ్రమ వాస్తవికత (మిక్స్‌డ్ రియాలిటీ) ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఇందులో ప్రభుత్వాల నుంచి క్లినికల్ అనుమతులు పొందడం క్లిష్టమైన ప్రక్రియ. పరికరాల ధరలు అధికంగా ఉండటం వల్ల సామాన్య ఆసుపత్రులకు ఇవి ఇంకా అందుబాటులో లేవు. దీనిని వాడటానికి వైద్య సిబ్బందికి ప్రత్యేక నైపుణ్యం అవసరం.
ఇదీ చదవండి: కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్
Tags : 1