Breaking News

నువ్వేం మనిషివయ్యా సుధీర్‌.. ‘ఫ్రీ’ కోసం పిల్లలు కంటావా?: మల్లారెడ్డి

Published on Sun, 04/26/2026 - 13:46

ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డికి సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ గురించి తెలిసిందే. ‘పాలమ్మినా.. పూలమ్మినా.. ’అనే డైలాగ్‌తో పాటు ఆయన ఏం మాట్లాడినా..ఆ మాటలు నెట్టింట వైరల్‌ అవుతుంటాయి.ఇక ఇటీవల తన 50 ఏళ్ల వివాహ వార్షికోత్సవం (గోల్డెన్ జూబ్లీ) సందర్భంగా తన భార్య కల్పనను మరోసారి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు. అయితే ఎప్పుడు రాజకీయ సభల్లో లేదా కాలేజీలో నిర్వహించే ఈవెంట్స్‌లో మాత్రమే పాల్గొనే మల్లారెడ్డి..తొలిసారి ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ షోకి గెస్ట్‌గా వెళ్లాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ షో ‘సర్కార్‌ షో’ ఆరో సీజన్‌లో పాల్గొన్నాడు. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యహరిస్తోన్న ఈ ఎంటర్ టైన్మెంట్ షో లో మల్లారెడ్డి తనదైన డైలాగులు, డ్యాన్స్ లు చేసి అలరించారు. 

తాజాగా దీనికి సంబంధించిన కొత్త ప్రోమో రిలీజ్‌ అయింది. అందులో హోస్ట్‌ సుధీర్‌పై మల్లారెడ్డి వేసిన పంచులు నవ్వులు పూయిస్తుంది. ‘పెళ్లి చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్‌ ఉంటాయా సార్‌’ అని సుధీర్‌ అడిగితే..‘పనికిరానోళ్లకు ప్రాబ్లమ్స్‌ ఉంటాయి’ అని తనదైన శైలీలో జవాబిచ్చాడు. అంతేకాదు ‘ఇంత ఏజ్‌ వచ్చినా పెళ్లి చేసుకోకపోతే నువ్వేం మనిషివయ్యా’ అని సుధీర్‌ని అనగానే.. పక్కనే ఉన్న అలీ, శివాజీ పలగబడి నవ్వారు. 

ఇక ‘సుధీర్‌ నువ్వు పెళ్లి చేసుకో.. నీ పిల్లలకు మల్లారెడ్డి తన కాలేజీలో ఫ్రీ సీటు ఇస్తాడు’అని అలీ అంటే..‘అవన్నీ ఏం లేవు..ఇది గవర్నమెంట్‌ కాదు’అని అంటూనే.. ‘ఫ్రీ కోసం పిల్లలు కంటడా ఏంటి? అని చమత్కరించాడు. ఇక ‘మీ బయోపిక్‌లో ఎవరు నటిస్తే బాగుంటుంది’అని సుధీర్‌ అడిగితే.. ‘డైరెక్టర్‌ ఎవరిని సెట్‌ చేస్తే వాళ్లు నటిస్తారు’ అని మల్లారెడ్డి తనదైన శైలీలో జవాబిచ్చాడు.  ఇంకా మల్లారెడ్డి ఏం మాట్లాడాడు.. ఆయన చేసిన సందడి ఎంటి అనేది మే1న ఫుల్‌ ఎపిసోడ్‌ రిలీజ్‌ అయిన తర్వాత తెలుస్తుంది. 

Videos

కాల్చింది మెకానికల్ ఇంజనీర్, ఉన్నత విద్యాంతుడు కూడా.. ఎందుకు చేశాడంటే..!

పడకపై కాటు - షాకింగ్ ఘటన! వేసవిలో సర్పాల ముప్పు

మాలీవుడ్ న్యూ ఇండస్ట్రీ హిట్ గా వాలా 2.!

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి

"కాల్పులు అయిపోయాయి ఇక తినండి.." ట్రంప్ షాకింగ్ రియాక్షన్

వరుణాస్త్రతో భారత్ సత్తా.. ఇక సముద్రంలో శత్రుదుర్భేద్యం

పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై పేర్ని నాని రియాక్షన్

No పెట్రోల్.. No డీజిల్.. APలో వాహన దారుల కష్టాలు

లేస్తే మనిషిని కాను

ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. తండ్రి, కొడుకు ఏం పీకుతున్నారు

Photos

+5

ఈవెంట్‌లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 26-మే 03)

+5

‘వాలా 2’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

మాళవిక మోహనన్ గ్లామర్ ధమాకా (ఫొటోలు)

+5

అందమైన అంబానీ ఫ్యామిలీ.. ఐకానిక్‌ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఉయ్యాల జంపాలా' నటి (ఫొటోలు)

+5

తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నా.. కవిత పార్టీ ప్రకటన (ఫొటోలు)