Breaking News

అడ్వెంచరస్‌ దాదీ!

Published on Sun, 04/26/2026 - 01:53

‘ఏజ్‌ ఈజ్‌ జస్ట్‌ ఏ నంబర్‌’ అని నిరూపిస్తున్నారు 73 ఏళ్ల ఒక బామ్మ. ఏమాత్రం భయం లేకుండా ఆకాశంలో విహరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్రసిద్ధ సాహస క్రీడల కేంద్రమైన బీర్‌ బిల్లింగ్‌లో ఆమె చేసిన పారాగ్లూడింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను పారాగ్లైడింగ్‌ ఇన్ స్ట్రక్టర్‌ అరుణ్‌ సింగ్‌ తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో కూడా ఆ బామ్మ ఏమాత్రం కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా, ఇన్ స్ట్రక్టర్‌తో నవ్వుతూ మాట్లాడుతుండటం విశేషం.

ఇన్ స్ట్రక్టర్‌ ఆమె వయసు అడగగా, తనకు 73 ఏళ్లు అని ఆమె ఎంతో ఉత్సాహంగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా ఇలాంటి సాహస కృత్యాలు చేయడం తనకు ఇదే మొదటిసారి కాదని, గతంలో ముస్సోరీలో కూడా ఇలాంటి అడ్వెంచర్‌ యాక్టివిటీస్‌ చేసినట్లు తెలిపారు. పారాగ్లైడింగ్‌ అనేది చాలా ప్రత్యేకమైన అనుభూతి అని, తాను దీన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానని ఆమె చెప్పారు.

ఈ వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు ఆ బామ్మ ఆత్మవిశ్వాసాన్ని కొనియాడుతున్నారు. ‘నేను కూడా ఈ దాదీ లాగే తయారవ్వాలనుకుంటున్నాను అని ఒకరు కామెంట్‌ చేయగా.. ‘జీవితాన్ని మనకు నచ్చినట్లు జీవించాలి! కలలను ఎప్పుడూ వదులుకోవద్దు’ అని మరొకరు రాసుకొచ్చారు. ‘ఎంత ఉత్సాహవంతురాలైన బామ్మ!’ అంటూ మరొకరు ప్రశంసలు కురిపించారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ బామ్మ చేస్తున్న సాహసకృత్యాలు, చూపిస్తున్న ఆత్మవిశ్వాసం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

Videos

కాల్చింది మెకానికల్ ఇంజనీర్, ఉన్నత విద్యాంతుడు కూడా.. ఎందుకు చేశాడంటే..!

పడకపై కాటు - షాకింగ్ ఘటన! వేసవిలో సర్పాల ముప్పు

మాలీవుడ్ న్యూ ఇండస్ట్రీ హిట్ గా వాలా 2.!

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి

"కాల్పులు అయిపోయాయి ఇక తినండి.." ట్రంప్ షాకింగ్ రియాక్షన్

వరుణాస్త్రతో భారత్ సత్తా.. ఇక సముద్రంలో శత్రుదుర్భేద్యం

పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై పేర్ని నాని రియాక్షన్

No పెట్రోల్.. No డీజిల్.. APలో వాహన దారుల కష్టాలు

లేస్తే మనిషిని కాను

ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. తండ్రి, కొడుకు ఏం పీకుతున్నారు

Photos

+5

ఈవెంట్‌లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 26-మే 03)

+5

‘వాలా 2’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

మాళవిక మోహనన్ గ్లామర్ ధమాకా (ఫొటోలు)

+5

అందమైన అంబానీ ఫ్యామిలీ.. ఐకానిక్‌ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఉయ్యాల జంపాలా' నటి (ఫొటోలు)

+5

తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నా.. కవిత పార్టీ ప్రకటన (ఫొటోలు)