Breaking News

పశ్చిమాసియా యుద్ధంతో ఆర్థిక సవాళ్లు

Published on Fri, 04/24/2026 - 09:26

పశ్చిమాసియాలో ఘర్షణలు, సరఫరా వ్యవస్థలో అవరోధాలతో ఇంధన ధరలు, తయారీ వ్యయాల పెరుగుదల రూపంలో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతున్నట్టు ఆర్‌బీఐ బులెటిన్‌ తెలిపింది. పశ్చిమాసియాలో ఘర్షణలతో మార్చి నెలలో అంతర్జాతీయ సరఫరా వ్యసవ్థపై ఒత్తిడులు పెరిగిపోయినట్టు పేర్కొంది. కాకపోతే ఏప్రిల్‌ మొదటి భాగంలో ఇవి కాస్తంత సడలినట్టు తెలిపింది. చాలా విభాగాల్లో ఆర్థిక కార్యకలాపాలు బలంగానే ఉన్నప్పటికీ.. కొన్ని రంగాల్లో నిదానించినట్టు వివరించింది.

పశ్చిమాసియాలో ఘర్షణ పరిస్థితుల తీవ్రత, అవి ఎంత కాలం పాటు కొనసాగుతాయి.. దీని ఫలితంగా ఇంధన, ఇతర మౌలిక వసతులకు వాటిల్లే నష్టం ద్రవ్యోల్బణం, వృద్ధికి రిస్క్‌లు కాగలవని పేర్కొంది. ‘‘ఘర్షణలు కొనసాగి, సరఫరా వ్యవస్థలు వేగంగా పునరుద్ధరణకు నోచుకోకపోతే అధిక ఇంధన ధరలు, అధిక తయారీ వ్యయాలు, వాణిజ్య ఎగుమతుల రూపంలో సవాళ్లకు దారితీయొచ్చు’’అని ఆర్‌బీఐ బులెటిన్‌ తెలిపింది.

ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నప్పటికీ, సరఫరా వైపు సమస్యలు, వాతావరణ సంబంధిత సమస్యలతో పెరిగే రిస్క్‌లు నెలకొన్నట్టు వెల్లడించింది. అమెరికా–ఇరాన్‌ మధ్య రెండు వారాల తాత్కాలిక సంధి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కొంత ఉపశమనంగా పేర్కొంది. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నందున షాక్‌లకు తట్టుకుని నిలబడగలదని ఈ బులెటిన్‌ను రూపొందించిన ఆర్‌బీఐ అధికారులు అభిప్రాయపడ్డారు.

Videos

నీ గుండెల్లో దమ్ముంటే ఎదురుగా రా.. చూసుకుందాం...

ఏపీ తొలి మహిళా సీజేకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు

హిందూ మహాసముద్రంలోకి అమెరికా యుద్ధనౌక..!

సామ్సన్ జిగేల్.. ముంబై ఢమాల్

తిరుపతి జిల్లాలో పెను విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మరణం

సమ్మెపై కొత్త టెన్షన్.. నాగిరెడ్డికి జేఏసీ నేతలు కౌంటర్

మీ పార్టీలో చేరుతా.. జీవితాంతం మీ పార్టీకి సేవ చేస్తా!

చంద్రబాబు, పవన్ కు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ, జనసేన నాయకులు

వర్మకు పవర్ కట్.. పాపం..ఏంటీ కర్మ..

ఐసీయూలో ఆసుపత్రులు

Photos

+5

హైదరాబాద్‌లో కొత్త పార్క్.. ఈ వేసవి సెలవుల్లో ఓ లుక్కేయండి (ఫొటోలు)

+5

గ్లామర్‌ క్వీన్‌ కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్‌ (ఫోటోలు)

+5

ప్రముఖ ఎగ్జిబిషన్‌లో టాలీవుడ్ యాంకర్‌ లాస్య సందడి (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో బుల్లితెర బ్యూటీ మంజుల సమ్మర్ చిల్ (ఫోటోలు)

+5

హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఇంట డబుల్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో జయం రవి, సింగర్ కెనీషా (ఫోటోలు)

+5

సంజనా గల్రానీ కూతురు బర్త్‌డేలో పాపులర్‌ ఎమ్మెల్యే (ఫోటోలు)

+5

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. పొద్దుపొద్దున్నే ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

జర్నీ జామ్‌ ఫుల్‌.. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల నిలువు దోపిడీ, ఇక్కట్లు (ఫొటోలు)

+5

‘జెట్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)