నీ గుండెల్లో దమ్ముంటే ఎదురుగా రా.. చూసుకుందాం...
Breaking News
ప్రభాస్ అభిమానిపై థియేటర్ సిబ్బంది దాడి
Published on Fri, 04/24/2026 - 07:21
ప్రభాస్ హిట్ సినిమా డార్లింగ్ రీ-రిలీజ్ అయింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సుదర్శన్ థియేటర్‌లో షో రన్ అవుతుండగా ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. ‘డార్లింగ్’ సినిమా విడుదలై 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 4K వెర్షన్‌లో రీ రిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా సంఖ్యలో మరోసారి సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే, సినిమా చూస్తున్న ప్రభాస్ అభిమానిపై సుదర్శన్ థియేటర్ యాజమాన్యం దాడి చేసినట్లు ఒక వీడియో వైరల్ అవుతుంది.
డార్లింగ్ సినిమాలోని పాటలు ఒక షోలో వేసి, మరో షోలో వేయకపోవడంతో అభిమానులు అభ్యంతరం తెలపడంతో తమపై దాడి చేశారని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే, థియేటర్ నిర్వహాకుల వర్షన్ మరోలా ఉంది. సదరు వ్యక్తి మద్యం మత్తులో థియేటర్‌లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో తాము రియాక్ట్ అయ్యామని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో నెటిజన్ల నుంచి వ్యతిరేఖత వస్తుంది. థియేటర్స్‌లలో తరుచుగా ఇలాంటి గొడవలు జరగడం సహజం. ఇలాంటి సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన యాజమాన్యం ఒకరిని కర్రతో కొట్టడం ఏంటి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఈ వేసవిలో సినిమా సందడి పెద్దగా కనిపించలేదు. కొత్త సినిమాలు విడుదల లేకపోవడంతో థియేటర్స్ బోసిపోయాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ హిట్ సినిమా ప్రమోషన్లతో హడావిడి చేసిన చిన్న సినిమాలు రెండురోజుల్లోనే చేతులు ఎత్తేయడంతో బాక్సాఫీస్ వద్ద పరిస్థితి మారిపోయింది. ఇలాంటి టైంలో డార్లింగ్ రూపంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌కు మరో ఆక్సీజెన్ దొరికింది. డార్లింగ్ సినిమాకు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. దర్శకుడు ఏ.కరుణాకరన్ తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీకి భారీ సంఖ్యలోనే ఫ్యాన్స్ ఉన్నారు.
ప్రభాస్ ఫ్యాన్‌పై #Sudarshan35MM థియేటర్ మేనేజ్మెంట్ దాడి
Songs ఒక షోలో వేసి, మరో షోలో వేయకపోవడంతో అభిమానులు అభ్యంతరం తెలిపారు. Songs వేయాలని అడిగిన అభిమానిపై దాడి జరిగినట్టు సమాచారం.#Darling4K #Prabhas pic.twitter.com/l9zwd6sy4u— Milagro Movies (@MilagroMovies) April 23, 2026
Ikada women bag lagindhi so daniki godava chesthe management motham ochi godava karraltho kottaru but baitaki anti fans misbehaving of women and spread chestunaru please share and repost this video atanu na Friend eh he's not that kind of man of misbehaving with women.#Darling4K pic.twitter.com/HIkXL8ZjVq
— Jack Sparrow (@Jack_Sparrow131) April 23, 2026
Tags : 1