Breaking News

గల్ఫ్‌ దేశాలకు ఇంజనీరింగ్‌ ఎగుమతులు డౌన్‌

Published on Fri, 04/24/2026 - 06:17

న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ ఇంజనీరింగ్‌ ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ఇంజనీరింగ్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ)గణాంకాల ప్రకారం.. మార్చి నెలలో యూఏఈకి ఎగుమతులు 237 మిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 2025 మార్చిలో ఎగుమతులు 715 మిలియన్‌ డాలర్లతో పోల్చితే 66.8 శాతం పడిపోయాయి. సౌదీ అరేబియాకు సైతం మార్చి నెలలో ఎగుమతులు 248 మిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.

 క్రితం ఏడాది ఇదే నెలలో ఈ దేశానికి ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు 450 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంటే 45 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మార్చి నెలలో దేశ ఇంజనీరింగ్‌ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు 1 శాతం పెరిగి 10.94 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025–26) మొత్తం మీద ఇంజనీరింగ్‌ ఎగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 5 శాతం వృద్ధితో 122.43 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 

2030 నాటికి ఇంజనీరింగ్‌ ఎగుమతులను 250 బిలియన్‌ డాలర్లకు (రెట్టింపు) చేర్చాలన్నది లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరం వస్తు ఎగుమతుల్లో ఇంజనీరింగ్‌ వాటా 27.71 శాతంగా ఉంది. అమెరికా టారిఫ్‌లు బాదేసినా ఆ దేశానికి గత ఆర్థిక సంవత్సరంలో ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు 2.3 శాతం పెరిగి 19.6 బిలియన్‌ డాలర్లకు చేరాయి. జర్మనీకి 14.6 శాతం అధికంగా 4.96 బిలియన్‌ డాలర్లు, యూకేకి 18.2 శాతం అధికంగా 4.74 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగాయి. చైనాకు 32 శాతం అధికంగా 3.53 బిలియన్‌ డాలర్లు, కొరియాకి 3 బిలియన్‌ డాలర్లు (16.7 శాతం అధికం) చొప్పున ఎగుమతులు వెళ్లాయి.  

ఇవి ఎక్కువ – ఇవి తక్కువ 
గత ఆర్థిక సంవత్సరంలో మోటారు వాహనాలు, కార్లు, టూ వీలర్లు, రాగి, ఐరన్‌ అండ్‌ స్టీల్, ఎలక్టరిక్‌ మెషినరీ ఎగుమతులు ఎక్కువగా జరిగాయి. అదే సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్‌ విడిభాగాలు, మెడికల్, సైంటిఫిక్‌ ఇనుస్ట్రుమెంట్ల ఎగుమతులు తగ్గాయి.   

#

Tags : 1

Videos

నీ గుండెల్లో దమ్ముంటే ఎదురుగా రా.. చూసుకుందాం...

ఏపీ తొలి మహిళా సీజేకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు

హిందూ మహాసముద్రంలోకి అమెరికా యుద్ధనౌక..!

సామ్సన్ జిగేల్.. ముంబై ఢమాల్

తిరుపతి జిల్లాలో పెను విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మరణం

సమ్మెపై కొత్త టెన్షన్.. నాగిరెడ్డికి జేఏసీ నేతలు కౌంటర్

మీ పార్టీలో చేరుతా.. జీవితాంతం మీ పార్టీకి సేవ చేస్తా!

చంద్రబాబు, పవన్ కు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ, జనసేన నాయకులు

వర్మకు పవర్ కట్.. పాపం..ఏంటీ కర్మ..

ఐసీయూలో ఆసుపత్రులు

Photos

+5

హైదరాబాద్‌లో కొత్త పార్క్.. ఈ వేసవి సెలవుల్లో ఓ లుక్కేయండి (ఫొటోలు)

+5

గ్లామర్‌ క్వీన్‌ కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్‌ (ఫోటోలు)

+5

ప్రముఖ ఎగ్జిబిషన్‌లో టాలీవుడ్ యాంకర్‌ లాస్య సందడి (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో బుల్లితెర బ్యూటీ మంజుల సమ్మర్ చిల్ (ఫోటోలు)

+5

హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఇంట డబుల్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో జయం రవి, సింగర్ కెనీషా (ఫోటోలు)

+5

సంజనా గల్రానీ కూతురు బర్త్‌డేలో పాపులర్‌ ఎమ్మెల్యే (ఫోటోలు)

+5

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. పొద్దుపొద్దున్నే ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

జర్నీ జామ్‌ ఫుల్‌.. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల నిలువు దోపిడీ, ఇక్కట్లు (ఫొటోలు)

+5

‘జెట్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)