Breaking News

జియో హవా.. జాతీయ స్థాయిలో ఆధిపత్యం!

Published on Thu, 04/23/2026 - 17:44

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెలికాం సర్కిల్‌లో ప్రధాన డిజిటల్ కనెక్టివిటీ ప్రొవైడర్‌గా రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. 2026 మార్చి నెలలో వైర్‌లెస్ అండ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగాల్లో గణనీయమైన సబ్‌స్క్రైబర్ పెరుగుదలను నమోదు చేసింది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. అత్యాధునిక బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడంలో జియోకు సాటి లేకుండా ముందంజలో ఉంది. అంతే కాకుండా.. సంప్రదాయ మొబైల్ సేవల్లో కూడా వేగంగా ఎదుగుతోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జియోలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్శన హై-స్పీడ్ హోమ్ అండ్ ఎంటర్‌ప్రైజ్ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణలో కనిపిస్తోంది. ఈ సర్కిల్‌లో వైర్‌లైన్ వృద్ధిని దాదాపు పూర్తిగా జియోనే సాధిస్తోంది. 2026 మార్చిలో జియో 31,000 కొత్త వైర్‌లైన్ కనెక్షన్లు సాధించి, మొత్తం ఫిక్స్‌డ్ లైన్ వినియోగదారుల సంఖ్యను 2.02 మిలియన్లకు పెంచింది. అదే సమయంలో భారతి ఎయిర్టెల్ కేవలం 7,648 కనెక్షన్లు మాత్రమే సాధించింది.

వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 5G ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA)లో జియో అగ్రస్థానంలో ఉంది. ఒకే నెలలో 22,003 కొత్త 5G FWA సబ్‌స్క్రైబర్లను జోడించి మొత్తం సంఖ్యను 7,33,617కు తీసుకెళ్లింది. దీనితో పోలిస్తే ఎయిర్టెల్ 6,103 మందిని మాత్రమే చేర్చి 3,26,398 వద్ద నిలిచింది.

తన ప్రత్యేక సాంకేతిక సామర్థ్యాన్ని చూపిస్తూ, అన్‌లైసెన్స్డ్ బ్యాండ్ రేడియో (UBR) FWA సేవలను అందిస్తున్న ఏకైక ఆపరేటర్‌గా కూడా జియో నిలుస్తోంది. ఈ విభాగంలో 18,991 కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 3,53,145కు పెంచింది. మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జియోకు 1.08 మిలియన్లకు పైగా ప్రత్యేక FWA కనెక్షన్లు ఉన్నాయి. ఇది ప్రాంతీయ డిజిటల్ మార్పుకు ప్రధాన శక్తిగా నిలుస్తోంది. సాంప్రదాయ వైర్‌లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో బలమైన ప్రదర్శన కనబరిచింది. 2026 మార్చిలో 1,49,464 కొత్త మొబైల్ వినియోగదారులను జోడించి మొత్తం సంఖ్యను 32.22 మిలియన్లకు పెంచింది.

జాతీయ స్థాయిలో ఆధిపత్యం
ప్రాంతీయ విజయంతో పాటు.. జియో జాతీయ స్థాయిలో కూడా అగ్రగామిగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వైర్డ్ మరియు వైర్‌లెస్ కలిపి 523.44 మిలియన్ల బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులతో జియో అతిపెద్ద సేవా ప్రదాతగా నిలిచింది. ఇది భారత బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో దాదాపు 49.11 శాతం వాటాను కలిగి ఉంది.

వైర్‌లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో దేశవ్యాప్తంగా 3.22 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 496.33 మిలియన్లకు పెంచింది. ఇది 39.21 శాతం మార్కెట్ వాటాతో ముందంజలో నిలిచింది. అదేవిధంగా ఫైబర్, ఫిక్స్‌డ్ లైన్ సేవల విస్తరణలో భాగంగా, మార్చి నెలలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 1,88,698 వైర్‌లైన్ కనెక్షన్లను జియో జోడించింది.

Videos

90 శాతం ఓటింగ్.. ఫుల్ జోష్ బెంగాల్ బీజేపీ

సెన్స్ లేదా..? జనసేన నేతలపై నాగబాబు సీరియస్

భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?

జపాన్ లో మరి కొద్ది రోజుల్లో.. మెగా సునామీ...

నా కొడుకు తప్పేం మాట్లాడలేదు.. TDP పై MLA కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు

ఓటు వేసిన సూర్య, జ్యోతిక

ప్రభుత్వం స్పందించడంలేదని డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

బాబుగారి మరో క్రెడిట్ చోరీ.. కొంచమైనా సిగ్గుగా లేదా.. నీ ఖాతాలో వేసుకోవడానికి..

చంద్రబాబు నన్ను ఇంటికి పిలిచి బెదిరించారు

ఏపీలో మండిపోతున్న ఎండలు

Photos

+5

ప్రముఖ ఎగ్జిబిషన్‌లో టాలీవుడ్ యాంకర్‌ లాస్య సందడి (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో బుల్లితెర బ్యూటీ మంజుల సమ్మర్ చిల్ (ఫోటోలు)

+5

హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఇంట డబుల్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో జయం రవి, సింగర్ కెనీషా (ఫోటోలు)

+5

సంజనా గల్రానీ కూతురు బర్త్‌డేలో పాపులర్‌ ఎమ్మెల్యే (ఫోటోలు)

+5

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. పొద్దుపొద్దున్నే ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

జర్నీ జామ్‌ ఫుల్‌.. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల నిలువు దోపిడీ, ఇక్కట్లు (ఫొటోలు)

+5

‘జెట్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

రెడ్‌ రోజ్‌లా మెరిసిపోతున్న హీరోయిన్ మానస వారణాసి (ఫొటోలు)

+5

రానా సతీమణి మిహికా బజాజ్ ఆర్ట్‌ షో.. సందడి చేసిన టాలీవుడ్ తారలు (ఫొటోలు)