Breaking News

EMI మిస్ అయింది.. ఇంటిని సీల్ చేస్తారా?

Published on Thu, 04/23/2026 - 16:32

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి చాలామంది బ్యాంకుల నుంచి గృహ రుణాలు (Home Loans) తీసుకుంటారు. అయితే, ఆర్థిక ఇబ్బందుల వల్లనో లేదా ఇతర కారణాల వల్లనో ఒకటి రెండు ఈఎంఐలు (EMI) చెల్లించలేకపోతే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. ఆ పరిస్థితి అలాగే కొనసాగితే మాత్రం మీ కలల సౌధం వేలం దాకా వెళ్లే ప్రమాదం ఉంది. అసలు ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే బ్యాంకులు కఠిన చర్యలు తీసుకుంటాయి? 'సర్ఫేసీ' చట్టం ఏం చెబుతోంది? పూర్తి వివరాలు మీకోసం..

ఎన్‌పీఏ అంటే ఏమిటి.. ఎప్పుడు ప్రకటిస్తారు?
మీరు మొదటి నెల ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంకులు ఫోన్ కాల్స్ లేదా ఎస్సెమ్మెస్‌ల ద్వారా గుర్తు చేస్తాయి. రెండో నెలలో కూడా అదే పరిస్థితి ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. ఒకవేళ వరుసగా మూడు నెలల పాటు మీరు ఈఎంఐ చెల్లించనట్లయితే, బ్యాంక్ మీ రుణ ఖాతాను ఎన్‌పీఏ (NPA- నిరర్థక ఆస్తి)గా మారుస్తుంది. ఇక్కడి నుంచే అసలు చట్టపరమైన ప్రక్రియ మొదలవుతుంది.

సర్ఫేసీ చట్టం.. బ్యాంకుల అస్త్రం
రుణగ్రహీత మొండి బకాయిదారుగా మారినప్పుడు బ్యాంకులు సర్ఫేసీ చట్టం, 2002 (SARFAESI act)ని ప్రయోగిస్తాయి. లోన్‌ ఖాతా ఎన్‌పీఏ మారిన తర్వాత, బ్యాంక్ రుణగ్రహీతకు 60 రోజుల గడువుతో డిమాండ్ నోటీసు ఇస్తుంది. బకాయి ఉన్న మొత్తాన్ని ఈ గడువులోగా చెల్లించాలని కోరుతుంది. ఈ 60 రోజుల వ్యవధిలో మీరు బ్యాంకును సంప్రదించి, మీ ఇబ్బందులను వివరించి చెల్లింపు గడువును పొడిగించుకునే లేదా రీ-స్ట్రక్చర్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇంటిని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు?
డిమాండ్ నోటీసు ఇచ్చిన 60 రోజుల తర్వాత కూడా రుణగ్రహీత స్పందించకపోతే, బ్యాంక్ సదరు ఆస్తిని భౌతికంగా స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ దశలో బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి నోటీసులు అంటించి, ఇంటిని సీల్ చేసే అధికారం కలిగి ఉంటారు.

వేలం ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది?
ఇంటిని స్వాధీనం చేసుకున్న తర్వాత బ్యాంక్ దానికి మార్కెట్ విలువను నిర్ధారిస్తుంది. ఆపై బకాయిలను వసూలు చేసుకోవడానికి బహిరంగ వేలం నిర్వహిస్తుంది. సాధారణంగా ఈఎంఐ నిలిచిపోయిన నాటి నుండి వేలం దాకా వెళ్లడానికి 5 నెలల నుండి 12 నెలల సమయం పడుతుంది. వేలానికి ముందు కూడా రుణగ్రహీతకు తన బకాయిలను పూర్తిగా చెల్లించి ఇంటిని కాపాడుకోవడానికి చివరి అవకాశం ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలు
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు బ్యాంకు నుండి వచ్చే కాల్స్ లేదా నోటీసులను విస్మరించవద్దు. నేరుగా బ్యాంకు అధికారులను కలిసి మీ పరిస్థితిని వివరిస్తే, వారు ఏదైనా వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. ఈఎంఐలు చెల్లించకపోతే మీ సిబిల్ (CIBIL) స్కోర్ దారుణంగా పడిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో మీకు మరెక్కడా రుణాలు లభించవు. బ్యాంకు వేలం వేసే ముందు ఆస్తి విలువను సరిగ్గా లెక్కించిందో లేదో తనిఖీ చేసుకునే హక్కు మీకు ఉంటుంది.

ఇది చదివారా? ఇల్లు.. ఎలాంటి డబ్బుతో కడుతున్నారు?

Videos

90 శాతం ఓటింగ్.. ఫుల్ జోష్ బెంగాల్ బీజేపీ

సెన్స్ లేదా..? జనసేన నేతలపై నాగబాబు సీరియస్

భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?

జపాన్ లో మరి కొద్ది రోజుల్లో.. మెగా సునామీ...

నా కొడుకు తప్పేం మాట్లాడలేదు.. TDP పై MLA కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు

ఓటు వేసిన సూర్య, జ్యోతిక

ప్రభుత్వం స్పందించడంలేదని డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

బాబుగారి మరో క్రెడిట్ చోరీ.. కొంచమైనా సిగ్గుగా లేదా.. నీ ఖాతాలో వేసుకోవడానికి..

చంద్రబాబు నన్ను ఇంటికి పిలిచి బెదిరించారు

ఏపీలో మండిపోతున్న ఎండలు

Photos

+5

ప్రముఖ ఎగ్జిబిషన్‌లో టాలీవుడ్ యాంకర్‌ లాస్య సందడి (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో బుల్లితెర బ్యూటీ మంజుల సమ్మర్ చిల్ (ఫోటోలు)

+5

హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఇంట డబుల్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో జయం రవి, సింగర్ కెనీషా (ఫోటోలు)

+5

సంజనా గల్రానీ కూతురు బర్త్‌డేలో పాపులర్‌ ఎమ్మెల్యే (ఫోటోలు)

+5

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. పొద్దుపొద్దున్నే ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

జర్నీ జామ్‌ ఫుల్‌.. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల నిలువు దోపిడీ, ఇక్కట్లు (ఫొటోలు)

+5

‘జెట్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

రెడ్‌ రోజ్‌లా మెరిసిపోతున్న హీరోయిన్ మానస వారణాసి (ఫొటోలు)

+5

రానా సతీమణి మిహికా బజాజ్ ఆర్ట్‌ షో.. సందడి చేసిన టాలీవుడ్ తారలు (ఫొటోలు)