Breaking News

ఫాస్ట్‌ట్యాగ్ పేరుతో మోసాలు: NHAI హెచ్చరిక

Published on Thu, 04/23/2026 - 15:04

హైవేలపై రద్దీని, వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 'ఫాస్ట్‌ట్యాగ్'ను పరిచయం చేసింది. ఆ తరువాత యాన్యువల్ పాస్ తీసుకొచ్చారు. మోసగాళ్లు కూడా.. ఈ సేవలను అందిస్తున్న మోసపూరిత వెబ్‌సైట్‌లను సృష్టించారు. ఈ విషయాన్ని NHAI వెల్లడిస్తూ.. ప్రయాణికులను హెచ్చరించింది.

ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌లను విక్రయిస్తున్నట్లు చెప్పుకునే నకిలీ వెబ్‌సైట్‌లు, అనధికారిక లింక్‌ల పట్ల జాగ్రత్త వహించాలని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. ఈ పాస్‌లు కేవలం అధికారిక రాజమార్గయాత్ర యాప్ ద్వారా మాత్రమే లభిస్తాయి. ఈ పాస్‌లను విక్రయించే అధికారం ఇతర ఏ ప్లాట్‌ఫామ్‌లకు లేదు. ఇతర నకిలీ ప్లాట్‌ఫామ్‌లను నమ్మితే.. ఆర్థిక మోసానికి లేదా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి దారితీయవచ్చు. అప్రమత్తంగా ఉండండి. తెలియని లింక్‌లను నమ్మకూడదని ఎన్‌హెచ్‌ఏఐ ట్వీట్ ద్వారా వెల్లడించింది.

ప్రజలను మోసం చేయడానికి మోసగాళ్లు అసలైన FASTag పోర్టల్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టిస్తున్నారు. అంతే కాకుండా సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ వంటివి ఉపయోగించే వాటిని ముందు వరసలో కనిపించేలా చేస్తున్నారు. ఇలాంటి వెబ్‌సైట్‌లను ఓపెన్ చేస్తే.. మొబైల్ నంబర్లు, వెహికల్స్ రిజిస్ట్రేషన్ సమాచారం, చెల్లింపు వివరాలు వంటి సున్నితమైన వివరాలను నమోదు చేయమని కోరతారు. ఇంటర్‌ఫేస్ నిజమైనదిగా కనిపించినప్పటికీ.. ఆ చెల్లింపు మోసగాళ్ల నియంత్రణలో ఉన్న ఖాతాలకు వెళ్తుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాల్సి ఉంటుందని NHAI హెచ్చరించింది.

ఇదీ చదవండి: యాపిల్‌ సీఈఓ.. టిమ్ కుక్ సంపద ఎంతో తెలుసా?

Videos

90 శాతం ఓటింగ్.. ఫుల్ జోష్ బెంగాల్ బీజేపీ

సెన్స్ లేదా..? జనసేన నేతలపై నాగబాబు సీరియస్

భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?

జపాన్ లో మరి కొద్ది రోజుల్లో.. మెగా సునామీ...

నా కొడుకు తప్పేం మాట్లాడలేదు.. TDP పై MLA కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు

ఓటు వేసిన సూర్య, జ్యోతిక

ప్రభుత్వం స్పందించడంలేదని డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

బాబుగారి మరో క్రెడిట్ చోరీ.. కొంచమైనా సిగ్గుగా లేదా.. నీ ఖాతాలో వేసుకోవడానికి..

చంద్రబాబు నన్ను ఇంటికి పిలిచి బెదిరించారు

ఏపీలో మండిపోతున్న ఎండలు

Photos

+5

ప్రముఖ ఎగ్జిబిషన్‌లో టాలీవుడ్ యాంకర్‌ లాస్య సందడి (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో బుల్లితెర బ్యూటీ మంజుల సమ్మర్ చిల్ (ఫోటోలు)

+5

హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఇంట డబుల్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో జయం రవి, సింగర్ కెనీషా (ఫోటోలు)

+5

సంజనా గల్రానీ కూతురు బర్త్‌డేలో పాపులర్‌ ఎమ్మెల్యే (ఫోటోలు)

+5

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. పొద్దుపొద్దున్నే ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

జర్నీ జామ్‌ ఫుల్‌.. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల నిలువు దోపిడీ, ఇక్కట్లు (ఫొటోలు)

+5

‘జెట్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

రెడ్‌ రోజ్‌లా మెరిసిపోతున్న హీరోయిన్ మానస వారణాసి (ఫొటోలు)

+5

రానా సతీమణి మిహికా బజాజ్ ఆర్ట్‌ షో.. సందడి చేసిన టాలీవుడ్ తారలు (ఫొటోలు)