ఆరు సీట్ల టెస్లా కారు.. వచ్చేసింది ఇండియా..

Published on Wed, 04/22/2026 - 13:17

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా.. భారత మార్కెట్లో మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఆరు సీట్ల సామర్థ్యం కలిగిన సరికొత్త 'మోడల్ Y' లాంగ్ వీల్ బేస్ (LWB) వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 61.99 లక్షలుగా నిర్ణయించారు. తాజా చేరికతో భారత్‌లో మోడల్ Y శ్రేణి ఇప్పుడు మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వీటి ధరలు రూ. 59.89 లక్షల నుండి ప్రారంభమై రూ. 67.89 లక్షల వరకు ఉన్నాయి.

ఈ కొత్త వెర్షన్ ప్రధాన ఆకర్షణ దీని విస్తరించిన వీల్ బేస్. 3,040 మిమీ పొడవైన వీల్ బేస్‌తో రూపొందించిన ఈ కారులో 2+2+2 లేఅవుట్‌తో ఆరు సీట్ల కాన్ఫిగరేషన్‌ను అందించారు. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే, ఈ ఎల్‌డబ్ల్యూబీ వేరియంట్ వెనుక సీటు ప్రయాణికులకు మరింత విశాలమైన స్థలాన్ని (లెగ్ రూమ్), సౌకర్యాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలకు, ఎక్కువ మంది ప్రయాణించే వీలున్న కారు కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది ఒక ఎంపికగా నిలుస్తుంది.

ఫీచర్ల పరంగా చూస్తే, ఈ కారులో అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఫీచర్లు ఉన్నాయి. క్యాబిన్‌లో 16-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లు, హీటెడ్-వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. డ్రైవర్ సౌకర్యం కోసం హీటెడ్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ సీట్ల వద్ద థై సపోర్ట్ వంటి సౌకర్యాలతో పాటు వెనుక వరుసలో ఉన్న వారికోసం పిల్లర్-మౌంటెడ్ రియర్ ఏసీ వెంట్లను కూడా ఏర్పాటు చేశారు. టెస్లా సిగ్నేచర్ మినిమలిస్ట్ డిజైన్, ఏరోడైనమిక్ లుక్ ఈ కారు సొంతం.

సామర్థ్యం విషయంలోనూ ఈ మోడల్ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇందులో అమర్చిన 88 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ మోటార్ సెటప్ ద్వారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 681 కిలోమీటర్లు (WLTP సర్టిఫైడ్) ప్రయాణించవచ్చు. ఇక స్పీడ్‌ విషయానికి వస్తే.. కేవలం 5 సెకన్లలోనే సున్నా నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని ఇది అందుకుంటుంది. పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌కు అనుగుణంగా, అత్యంత శక్తివంతమైన, విలాసవంతమైన ఫ్యామిలీ ఎస్‌యూవీగా ఈ టెస్లా మోడల్ Y కారు భారత మార్కెట్లో తన ఉనికిని చాటనుంది.

Videos

తెలంగాణలో కొనసాగుతున్న బంద్.. అల్లాడుతున్న ప్రయాణికులు

ఈ సినిమాలో పెద్ద స్టార్ట్ నటీమణులు ఒకేసారి కనిపించనున్నారు

పెళ్లి అయిన 3 నెలల నుంచే గర్భిణీ అని కూడా చూడలేదు

పవన్ కళ్యాణ్.. మీ పార్టీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా?

భరణం పేరుతో భర్తపై 'భారం' విడాకుల కేసుల్లో విడ్డూరాలు?

మాజీ సీఎం నాదెండ్ల మృతిపై YS జగన్ సంతాపం

చిట్టిబాబు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు

సీఎం రేవంత్ పాటలు పై సింగర్ మధుప్రియ కామెంట్స్

జగనన్న ఇళ్లు కాదు ఊర్లు ఊర్లే సృష్టించాడు, అది వైఎస్ జగన్ అంటే..

సందిట్లో సడేమియా RTC సమ్మెతో.. తెలంగాణలో కర్ణాటక స్పెషల్ బస్సులు

Photos

+5

ప్రకృతి ఒడిలో అనసూయ సమ్మర్ చిల్ (ఫొటోలు)

+5

తస్సాదియ్యా.. సమంత ఇంత సింపుల్‌గా ఉందేంటి! (ఫొటోలు)

+5

కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్‌ (ఫొటోలు)

+5

నేటి నుండి కేదార్‌నాథ్‌ దర్శనం.. భారీగా భక్తులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన శివాలయం గురించి తెలుసా మీకు? (ఫోటోలు)

+5

'వాలా 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తేజా సజ్జా సందడి (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

SRH vs DC : ఉప్పల్‌ స్టేడియంలో ఆరెంజ్‌ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

కూతురు, కుమారుడితో తారకరత్న భార్య ‍అలేఖ్య రెడ్డి (ఫొటోలు)

+5

మృణాల్ ఠాకుర్ 'ఫ్లవర్' లవ్.. ఎన్నో వెరైటీస్ (ఫొటోలు)