Breaking News

యాపిల్‌ సీఈఓ.. టిమ్ కుక్ సంపద ఎంతో తెలుసా?

Published on Tue, 04/21/2026 - 21:43

ప్రపంచ టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలిచిన యాపిల్ కంపెనీ ఇటీవల ఒక కీలక ప్రకటన చేసింది. 2026 సెప్టెంబర్‌లో ప్రస్తుత సీఈఓ 'టిమ్ కుక్' తన పదవి నుంచి వైదొలగి.. బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.

టిమ్ కుక్ 1998లో యాపిల్‌లో చేరి.. కంపెనీ సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఎదిగారు. స్టీవ్ జాబ్స్ ఆరోగ్య కారణాల వల్ల తప్పుకున్న తర్వాత, 2011లో ఆయన కంపెనీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి యాపిల్ సంస్థను ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థలలో ఒకటిగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు.

టిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ విలువ సుమారు 4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అలాగే ఐఫోన్ తయారీకి అవసరమైన ఉత్పత్తి కేంద్రాలను చైనాలో విస్తరించడం ద్వారా గ్లోబల్ సరఫరా వ్యవస్థను బలపరిచారు. ఫాక్స్‌కాన్ వంటి కంపెనీలతో భాగస్వామ్యం యాపిల్ విజయానికి ప్రధాన కారణమైంది.

టిమ్ కుక్ సంపద - ఆదాయం
టిమ్ కుక్ సంపద సుమారు 2.9 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.27 వేలకోట్లు) ఉంటుందని అంచనా. కాగా ఈయన వద్ద యాపిల్ కంపెనీ షేర్లు 3 మిలియన్లకు పైగా ఉన్నాయి.

ప్రారంభంలో సీఈఓగా టిమ్ కుక్ జీతం 9,00,000 డాలర్లుగా ఉండేది. తర్వాత ఇది 3 మిలియన్ డాలర్ల బేస్ సాలరీగా స్థిరపడింది. అయితే ఆయన మొత్తం ఆదాయం స్టాక్ అవార్డులు, బోనస్‌ల ద్వారా భారీగా పెరిగింది. 2022లో ఆయన మొత్తం ఆదాయం సుమారు 99.4 మిలియన్ డాలర్లకు చేరింది. 2023లో షేర్‌హోల్డర్ల అభిప్రాయాలను గౌరవిస్తూ తన వేతనాన్ని స్వచ్ఛందంగా తగ్గించుకున్నారు. కానీ కంపెనీ పనితీరు, స్టాక్ పెరుగుదల కారణంగా 2024లో మళ్లీ ఆయన ఆదాయం సుమారు 74.6 మిలియన్ డాలర్లకు పెరిగింది.

ఆపిల్ వృద్ధిలో టిమ్ కుక్ పాత్ర
టిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ కంపెనీ ఆదాయం 108 బిలియన్ డాలర్ల నుంచి 416 బిలియన్ డాలర్లకు పెరిగింది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఆధిపత్యం సాధించింది. ఐఫోన్, మ్యాక్‌బుక్, ఐప్యాడ్ వంటి ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందాయి. దీన్నిబట్టి చూస్తే కుక్ సారథ్యంలో కంపెనీ ఎంతగా ఎదిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: '2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': రాబర్ట్ కియోసాకి

#

Tags : 1

Videos

పహల్గామ్ దాడి కీలక ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ భట్ హతం

పసిడి ధరల దూకుడుకు బ్రేక్.. వెండి రూ.5 వేలు ఢమాల్..!

కాపులను నరికేస్తాం! బుచ్చయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

ఛాలెంజ్ చేసి చెప్తున్నా... బాబు కంటే జగన్ ప్రభుత్వమే మంచిది

పెండెం దొరబాబుకు వర్మ మాస్ వార్నింగ్

AI రోబో స్పీడ్ రికార్డు బీజింగ్ లో హవా

అన్న క్యాంటీన్‌పై రిపోర్టర్ ప్రశ్న,అంబటి అదిరిపోయే రిప్లై

పాక్ ధురంధర్ కి పోటీగా సినిమా ట్రోలింగ్ జోరు

MGNREGA అమలులో నిర్లక్ష్యం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా..?

Photos

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

SRH vs DC : ఉప్పల్‌ స్టేడియంలో ఆరెంజ్‌ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

కూతురు, కుమారుడితో తారకరత్న భార్య ‍అలేఖ్య రెడ్డి (ఫొటోలు)

+5

మృణాల్ ఠాకుర్ 'ఫ్లవర్' లవ్.. ఎన్నో వెరైటీస్ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఈషా రెబ్బా బర్త్ డే మూమెంట్స్ (ఫొటోలు)

+5

కాలేజీ అమ్మాయిలా హీరోయిన్ అనన్య నాగళ్ల (ఫోటోలు)

+5

పశ్చిమగోదావరి : నరసాపురంలో సినీనటి అనసూయ సందడి (ఫొటోలు)

+5

'కపుల్‌ ఫ్రెండ్లీ' బ్యూటీ మానస వారణాసి లేటెస్ట్‌ ఫోటోలు

+5

రేంజ్‌ రోవర్‌ కొన్న నితీశ్.. పెద్ద‌మ్మ గుడిలో కాయిన్‌ పెట్టి పూజ‌లు (ఫొటోలు)

+5

సింహాచలం : స్వామి నిజరూప దర్శనం.. భక్తులకు అష్టకష్టాలు (ఫొటోలు)