పహల్గామ్ దాడి కీలక ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ భట్ హతం
Breaking News
అందరిచూపు.. ఆసియా దేశాలవైపు!
Published on Tue, 04/21/2026 - 20:39
భారతీయ ప్రయాణికులు ఈ వేసవిలో ఎక్కువగా ఆసియా దేశాలను సందర్శించడానికి ఇష్టపడుతున్నట్లు ఎయిర్‌బీఎన్‌బీ వెల్లడించింది. ఇప్పటి యువత, ముఖ్యంగా Gen Z తరం, కొరియన్ డ్రామాలు, జపనీస్ సంస్కృతి, ఆసియన్ స్ట్రీట్ ఫుడ్ వంటి వాటికి ఆకర్షితులవుతున్నారు. కాబట్టి ఆసియా టూరిజం మీద ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది.
ఎయిర్‌బీఎన్‌బీ గణాంకాల ప్రకారం.. ఈ వేసవిలో 40 శాతం కంటే ఎక్కువ జెన్ జీ వర్గానికి చెందిన వారు ఆసియా దేశాలకు ట్రావెల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణాలు కేవలం కేవలం విశ్రాంతి కోసం కాకుండా అనుభవాల కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంగీత కచేరీలు, పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన అనుభవాలు వంటి అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
జపాన్, దక్షిణ కొరియా, దక్షిణ - తూర్పు ఆసియా దేశాల్లోని నగరాలు భారతీయుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఓసాకా, టోక్యో, బుసాన్ వంటి నగరాల్లో సెర్చ్‌లు గణనీయంగా పెరిగాయి. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్ వంటి నగరాలు కూడా తమ సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయాలు, పరిచయంతో కూడిన వాతావరణం వల్ల ప్రజాదరణ పొందుతున్నాయి.
ప్రయాణం ఇప్పుడు వ్యక్తిగతంగా కాకుండా కుటుంబంతో, స్నేహితులతో కలిసి చేసే అనుభవంగా మారుతోంది. దాదాపు 60 శాతం మంది గ్రూప్ లేదా ఫ్యామిలీ ట్రావెల్ చేసినట్లు గణాంకాల ద్వారా తెలిసింది. దేశీయంగా కూడా కొత్త ట్రెండ్‌లు కనిపిస్తున్నాయి. ప్రజలు సాధారణంగా వెళ్లే ప్రదేశాలకంటే భిన్నమైన, ప్రకృతి, సంప్రదాయం, సంస్కృతి కలిగిన ప్రాంతాలను అన్వేషిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా తిరువనంతపురం, పూరి, జైపూర్, మేఘాలయ వంటి ప్రదేశాలు ఉన్నాయి.
Tags : 1