పహల్గామ్ దాడి కీలక ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ భట్ హతం
Breaking News
హ్యుందాయ్ - టీవీఎస్ ఎలక్ట్రిక్ ఆటోలు!
Published on Tue, 04/21/2026 - 17:42
మన రోడ్లపై ఇక హ్యుందాయ్–టీవీఎస్ ఎలక్ట్రిక్ ఆటోలు పరుగులు తీయనున్నాయి. దేశంలో చివరి గమ్యస్థాన రవాణా (లాస్ట్ మైల్ మొబిలిటీ) అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ–త్రీవీలర్ విభాగంలో హ్యుందాయ్ మోటార్, టీవీఎస్ మోటార్ సంస్థలు వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి.
దీని ప్రకారం ఉత్పత్తి రూపకల్పన, సాంకేతికాభివృద్ధిలను హ్యుందాయ్ అందించనుంది. టీవీఎస్ తన ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్, తయారీ సామర్థ్యం, మార్కెట్ నైపుణ్యంతో భాగస్వామ్యం కానుంది. అలాగే దేశీయ తయారీ, డిస్ట్రిబ్యూషన్, విక్రయాలను టీవీఎస్ నిర్వహించనుంది. ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో–2025’లో ఈ–త్రీ వీలర్ కాన్సెప్ట్ విజయవంతంగా ప్రదర్శన అనంతరం ఇరు సంస్థలు ఈ భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రకటించాయి.
ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ కంపెనీ కార్పొరేట్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూన్సన్ కో మాట్లాడుతూ, భారతదేశం తమకు కీలక మార్కెట్‌గా ఉన్నందున రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో భాగస్వామ్యం కావడం లక్ష్యమని తెలిపారు.
ఇదీ చదవండి: పోర్స్చే కారుపై సిమెంట్ కలిపిన వ్యాపారవేత్త: వీడియో
Tags : 1