Breaking News

పోర్షే కారుపై సిమెంట్ కలిపిన వ్యాపారవేత్త: వీడియో

Published on Tue, 04/21/2026 - 16:52

బెంగళూరులో జరిగిన ఒక సంఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో వ్యాపారవేత్త అఖిల్ హేమాద్రి రోడ్డుపై గుంతను పూడ్చడానికి చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

వీడియోలో గమనించినట్లయితే.. కోట్ల రూపాయల విలువైన పోర్షే (Porsche) కారులో అఖిల్ హేమాద్రి అక్కడికు వచ్చి, రోడ్డుపై ఉన్న గుంతను పూడ్చడానికి సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రిని తీసుకుంటారు. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించిన విషయం ఏమిటంటే.. సిమెంట్ మిశ్రమాన్ని కారు బానెట్ మీద కలిపాడు. ఖరీదైన కారుపై ఇలా చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ ఆయన తన కారుపై రక్షణ పొర (PPF) ఉండటం వల్ల ఎలాంటి నష్టం జరగదని చూపించడానికి ఈ విధానం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

సిమెంట్ మిశ్రమం కలిపిన తరువాత గుంతను పూడ్చేస్తాడు. చివరగా బానెట్‌పై ఉన్న షీట్‌ను తొలగిస్తారు. దీంతో కారుకు ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా కార్ల రక్షణ కోసం ఉపయోగించే పీపీఎఫ్ బలాన్ని చూపించడమే ఈ వీడియో ఉద్దేశ్యం అయినప్పటికీ.. ఈ చర్య ద్వారా సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించారని పేర్కొన్నారు.

వీడియో షేర్ చేసిన హెచ్1 కార్ డీటైలింగ్.. ''మన పరిసరాలను పరిశుభ్రంగా, చక్కగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. మనం ప్రతిదానికీ ఎల్లప్పుడూ ప్రభుత్వంపై ఆధారపడకూడదు. మన దేశంలో జనాభా చాలా ఎక్కువ, కేవలం ప్రభుత్వ ప్రయత్నాలతో మాత్రమే మార్పు రాదు. మనలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించినప్పుడే నిజమైన మార్పు మొదలవుతుంది'' అని వెల్లడించింది.

Videos

పహల్గామ్ దాడి కీలక ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ భట్ హతం

పసిడి ధరల దూకుడుకు బ్రేక్.. వెండి రూ.5 వేలు ఢమాల్..!

కాపులను నరికేస్తాం! బుచ్చయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

ఛాలెంజ్ చేసి చెప్తున్నా... బాబు కంటే జగన్ ప్రభుత్వమే మంచిది

పెండెం దొరబాబుకు వర్మ మాస్ వార్నింగ్

AI రోబో స్పీడ్ రికార్డు బీజింగ్ లో హవా

అన్న క్యాంటీన్‌పై రిపోర్టర్ ప్రశ్న,అంబటి అదిరిపోయే రిప్లై

పాక్ ధురంధర్ కి పోటీగా సినిమా ట్రోలింగ్ జోరు

MGNREGA అమలులో నిర్లక్ష్యం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా..?

Photos

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

SRH vs DC : ఉప్పల్‌ స్టేడియంలో ఆరెంజ్‌ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

కూతురు, కుమారుడితో తారకరత్న భార్య ‍అలేఖ్య రెడ్డి (ఫొటోలు)

+5

మృణాల్ ఠాకుర్ 'ఫ్లవర్' లవ్.. ఎన్నో వెరైటీస్ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఈషా రెబ్బా బర్త్ డే మూమెంట్స్ (ఫొటోలు)

+5

కాలేజీ అమ్మాయిలా హీరోయిన్ అనన్య నాగళ్ల (ఫోటోలు)

+5

పశ్చిమగోదావరి : నరసాపురంలో సినీనటి అనసూయ సందడి (ఫొటోలు)

+5

'కపుల్‌ ఫ్రెండ్లీ' బ్యూటీ మానస వారణాసి లేటెస్ట్‌ ఫోటోలు

+5

రేంజ్‌ రోవర్‌ కొన్న నితీశ్.. పెద్ద‌మ్మ గుడిలో కాయిన్‌ పెట్టి పూజ‌లు (ఫొటోలు)

+5

సింహాచలం : స్వామి నిజరూప దర్శనం.. భక్తులకు అష్టకష్టాలు (ఫొటోలు)