భారత నౌకలను పేల్చేస్తాం బయటపడ్డ రేడియో సంభాషణ క్లిప్...
Breaking News
బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు.. యూనిక్‌గా ప్రకటన
Published on Mon, 04/20/2026 - 11:48
తమిళ స్టార్ దర్శకుడు అట్లీ, ప్రియ దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. తమకు ఆడబిడ్డ జన్మించినట్లు చాలా యూనిక్‌గా సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. ఈ జంట మొదటిసారిగా 2026 జనవరిలో గర్భధారణ విషయాన్ని ప్రకటించారు. ఆ సమయంలో కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో తమ కుమారుడు మీర్ కోణం నుండి అభిమానులకు తెలిపారు. ఇప్పుడు కూడా మీర్‌కు ఒక చెల్లి వచ్చిందని ఒక పోస్టర్‌తో షేర్ చేశారు. ఆసక్తికరంగా ప్రముఖ నటి దీపికా పడుకోణె కూడా తన గర్భధారణను ఇదే తరహాలో కొద్దిరోజుల క్రితమే ప్రకటించడం విశేషం. సమంత, కాజల్ అగర్వాల్, అనన్య పాండే, నిషా అగర్వాల్ తదితర సెలబ్రిటీలు అట్లీ దంపతులకు అభినందనలు తెలిపారు.
సినీ నటి ప్రియని 2014లో అట్లీ పెళ్లి చేసుకున్నాడు. 2023లో వారికి మగబిడ్డ మీర్ జన్మించాడు. సుమారు మూడేళ్ల తర్వాత 2026 ఏప్రిల్ 20న వారికి ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం అట్లీ తన కొత్త సినిమా రాకా కోసం బిజీగా పనిచేస్తున్నాడు. ఇందులో అల్లు అర్జున్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే.
Tags : 1