అంబటి రాంబాబు దీక్ష వద్ద జడ శ్రావణ్ స్పీచ్
Breaking News
తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్
Published on Sat, 04/18/2026 - 19:09
'వరూధిని పరిణయం' సీరియల్ హీరోయిన్ చందన శెట్టి తల్లికాబోతున్న విషయాన్ని ప్రకటించింది. ఇప్పుడు మరో సీరియల్ హీరోయిన్గా కూడా ఇలాంటి శుభవార్త చెప్పింది. కాకపోతే ఆ విషయాన్ని కూడా సినిమాటిక్ వీడియోగా తీసి వెల్లడించింది.
(ఇదీ చదవండి: నటిపై చాహల్ పరువు నష్టం దావా.. వీళ్ల మధ్య అసలేమైంది?)
'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్లో రామరాజు చిన్నకోడలు ప్రేమ పాత్రని లావణ్య భరద్వాజ్ చేస్తోంది. తనదైన చలాకీ నటనతో ఆకట్టుకుంటోంది. స్వతహాగా కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈమెనే ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. భర్త శశి హెగ్డేతో కలిసి ఓ వీడియోని పోస్ట్ చేసింది. 'చిన్నారితో మా ప్రేమకథ కొనసాగుతూనే ఉంటుంది' అని చెప్పుకొచ్చింది.
లావణ్య ఈ విషయాన్ని బయటపెట్టగానే తోటి హీరోయిన్ అన్షు రెడ్డితో పాటు మిగతా వాళ్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ నేపథ్యంలో లావణ్య.. ఈ సీరియల్కి గుడ్ బై చెప్పనుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఈమె స్థానంలో 'నిన్ను కోరి' సీరియల్ ఫేమ్ అక్షిత దేశ్ పాండేని తీసుకుంటారనే ప్రచారం కూడా నడుస్తోంది.
(ఇదీ చదవండి: ట్రైలర్: ఈసారి రక్తపాతాన్ని నమ్ముకున్న రవిబాబు)
Tags : 1