Breaking News

మెటాలో భారీ లేఆఫ్‌లు.. 16,000 మందిపై వేటు?

Published on Sat, 04/18/2026 - 18:06

సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్‌ఫార్మ్స్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. రాబోయే నెలల్లో సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మొదటి దశ మే 20న ప్రారంభం కానుందని, తొలి విడతలోనే దాదాపు 8,000 మంది ఉగ్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఇది మెటా ప్రపంచ శ్రామిక శక్తిలో సుమారు 10 శాతం వంతు కావడం గమనార్హం.

మార్క్ జుకర్‌బర్గ్ నాయకత్వంలోని మెటా, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్తులో కార్యకలాపాలను మరింత ఆటోమేషన్‌ చేసే దిశగా కంపెనీ తన శ్రామిక శక్తిని పునర్నిర్మిస్తోంది. కేవలం ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసమే ఏడాదికి సుమారు 135 బిలియన్‌ డాలర్ల భారీ వ్యయాన్ని కంపెనీ ప్రణాళిక చేస్తోంది. ఈ వ్యూహాత్మక మార్పుల వల్లే ప్రస్తుత ఉద్యోగ కోతలు అనివార్యమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే 2022, 2023 మధ్య కాలంలో మెటా దాదాపు 21,000 మంది ఉద్యోగులను తొలగించింది. కోవిడ్‌ మహమ్మారి సమయంలో అధిక విస్తరణ, తదనంతర ఆర్థిక మందగమనం వల్ల ఆ నిర్ణయాలు తీసుకున్నట్లు అప్పట్లో కంపెనీ వెల్లడించింది. తాజాగా ఇప్పుడు ఏఐ పురోగతి, ఉద్యోగుల ఉత్పాదకతను ప్రాతిపదికగా తీసుకుని తుది జాబితాను ఎగ్జిక్యూటివ్‌లు సిద్ధం చేస్తున్నారు.

నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, స్టాక్ మార్కెట్‌లో కంపెనీ పనితీరును మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ లేఆఫ్‌లు సాగనున్నాయి. 2026 చివరి నాటికి మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం ఉందని, దీనివల్ల ప్రభావితమయ్యే మొత్తం ఉద్యోగుల సంఖ్య 16,000కు చేరుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామం ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మరోసారి తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.

ఇదీ చదవండి: కాగ్నిజెంట్ సీఈవోకి భారీ వేతనం.. రూ.కోట్లలో హైక్‌

#

Tags : 1

Videos

అంబటి రాంబాబు దీక్ష వద్ద జడ శ్రావణ్ స్పీచ్

ముగ్గువేసి మనసులు గెలిచిన విజయ్

మహిళా బిల్లుపై బాబు కుట్ర ఆధారాలతో బయటపెట్టిన MLC లేళ్ల అప్పిరెడ్డి

అంతా బోగస్.. సుమన్ శెట్టి షాకింగ్ నిజాలు

విజయ్ కి అంత సీన్ లేదు...ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్

నాకు ఫీల్డింగ్ పెట్టడం రాదు అంతా రోహితే చూసుకునేవాడు..

మమ్మల్ని హింసించిన వారిని 2029 తరువాత కులం,మతం చూడకుండానే బొక్కలో వేస్తాం

నా రైట్స్ నాకే..! హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

ఆల్కా అదిరిపోయే ఆఫర్ 100 షేర్లు కొంటే 600షేర్లు ఫ్రీ

Photos

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)

+5

'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. ధనా ధన్‌ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)

+5

ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)