కారును మించిన ‘రేంజ్‌’లో కొత్త స్కూటర్‌

Published on Fri, 04/17/2026 - 17:46

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy) భారత మార్కెట్లోకి సంచలన మోడల్‌ను ప్రవేశపెట్టింది. తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'సింపుల్ అల్ట్రా' (Simple Dot One/Ultra)ను రూ. 2.35 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో 'జెన్ 2' లైనప్‌తో పాటు ఆవిష్కరించిన ఈ స్కూటర్, ఇప్పుడు బుకింగ్స్‌కు సిద్ధంగా ఉంది.

ఒక్క ఛార్జ్‌తో 400 కిలోమీటర్లు!
ఈ స్కూటర్ ప్రధాన ఆకర్షణ దాని రేంజ్. సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 400 కిలోమీటర్ల (IDC) మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ద్విచక్ర వాహన రంగంలో ఇదే అత్యధికం. ఈ స్థాయి రేంజ్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని ఎలక్ట్రిక్ కార్లకు కూడా లేదు.

ఉదాహరణకు, భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా టియాగో ఈవీ లాంగ్ రేంజ్ వెర్షన్ (ధర సుమారు రూ. 7.99 లక్షలు) ఒక్క ఛార్జ్‌పై 293 కిమీ మాత్రమే ఇస్తుంది. ఈ లెక్కన చూస్తే, కారు కంటే సగం ధరలోనే అంతకంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్‌గా 'సింపుల్ అల్ట్రా' రికార్డు సృష్టించింది.

పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్
ఈ స్కూటర్ 6.5 kWh భారీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది కేవలం 2.77 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కి.మీ. ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో రైడర్ భద్రత కోసం ఫోర్-లెవల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అలాగే, రైడింగ్ డేటా, కనెక్టివిటీ ఫీచర్ల కోసం 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.

విలువ పరంగా చూస్తే.. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రూ. 2.35 లక్షలు ఖర్చు చేయడం ఎక్కువ అనిపించినా, అది ఇచ్చే 400 కిమీ రేంజ్ వాహనదారులకు భారీ లాభాన్ని చేకూరుస్తుంది. ఈ ధర ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కేటీఎం 250 డ్యూక్ (రూ. 2.17 లక్షలు) వంటి స్పోర్ట్స్ బైక్ల ధరకు ఇంచుమించు సమానంగా ఉంది.

Videos

ఏపీ అభివృద్ధికి తారకమంత్రం.. ప్రజల్లో మావిగన్ క్రేజ్

మళ్లీ అదే కథ! పరాజయాల వైపు KKR

అంబటి రాంబాబు నిరాహార దీక్ష

ఇరాన్ గుడ్ న్యూస్.. తెరుచుకున్న హార్ముజ్

దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలపై YS జగన్ సంచలన పోస్ట్

వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. వరుదు కళ్యాణి రియాక్షన్

మోదీకి బిగ్ షాక్.. పార్లమెంట్ లో ఎదురుదెబ్బ..

జనగణన పూర్తి కాకుండానే డీలిమిటేషన్ బిల్లు.. దక్షిణాదికి జరిగే నష్టం ఇదే!

కూకట్ పల్లిలో ఘోర బస్సు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

గెలవదని తెలిసే బిల్లు విషయంలో ముందుకెళ్లారా?

Photos

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)

+5

'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. ధనా ధన్‌ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)

+5

ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)