Breaking News

వేదాంత ఛైర్మన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

Published on Fri, 04/17/2026 - 08:32

ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో ఉన్న వేదాంత గ్రూప్ విద్యుత్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏప్రిల్ 14న జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సింగితరై గ్రామంలోని ప్లాంట్‌లో బాయిలర్ నుంచి టర్బైన్‌కు అధిక పీడనంతో ఆవిరిని తీసుకెళ్లే స్టీల్ ట్యూబ్ ఒక్కసారిగా పేలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

చట్టపరమైన చర్యలు

శక్తి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ప్రఫుల్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం, దబ్రా పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుండటంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) కింద కొన్ని సెక్షన్లను నమోదు చేశారు.

  • సెక్షన్ 106: నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం కావడం.

  • సెక్షన్ 289: యంత్రాల నిర్వహణలో అజాగ్రత్తగా వ్యవహరించడం.

  • సెక్షన్ 3(5): కామన్‌ ఇంటెన్షన్‌

‘ఎఫ్ఐఆర్‌లో ఛైర్మన్ అనిల్ అగర్వాల్ సహా 8 నుంచి 10 మంది వ్యక్తుల పేర్లను చేర్చాము. దర్యాప్తులో మరింత మంది బాధ్యుల పేర్లు వెలుగులోకి వస్తే వారిని కూడా నిందితులుగా చేరుస్తాం’ అని ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ వెల్లడించారు.

దర్యాప్తు ముమ్మరం

ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను విశ్లేషించేందుకు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పేలుడు కారణాలను అన్వేషించడానికి నిపుణులతో కూడిన సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతుల పోస్టుమార్టం నివేదికలు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ విశ్లేషణ, పారిశ్రామిక భద్రతా విభాగం ఇచ్చే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ నివేదికలు అందిన తర్వాత అవసరమైతే మరిన్ని కఠిన సెక్షన్లను జోడించే అవకాశం ఉంది.

ఈ ప్రమాదంపై రాజకీయంగా కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ప్లాంట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కేవలం ఎఫ్ఐఆర్ నమోదుతో సరిపెట్టకుండా ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని పట్టుబట్టింది. మృతుల కుటుంబాలకు భారీ పరిహారం అందించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరింది.

ఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్‌లతో కాసుల వేట!

Videos

హోదా పక్కన పెట్టి మానవత్వం.. తల్లీ, తండ్రి లేని మహిళా కానిస్టేబుల్ కు సీమంతం

నాకు రాజకీయాల్లో ఎన్నో విషయాలు నేర్పారు.. అవినాష్ కల్మషం లేని వ్యక్తి..

శ్రీయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్, ముంబై ఫ్యాన్స్ కు ఇచ్చిపడేసాడు

జగనన్న చేసినంత ఎవరూ చేయలేదు.. మహిళలకు సొంత అన్న జగన్

ఇండస్ట్రీని షేక్ చేసే ప్రాజెక్ట్.. 4000 కోట్లు లోడింగ్..

కేంద్ర ఉద్యోగులకి జాక్ పాట్ కనీస వేతనం 69 వేలకు పెంపు

కుప్పం కోర్టు చీవాట్లు.. జగన్ టూర్ గ్రాండ్ సక్సెస్

లోక్ సభలో పరువుపాయే.. TDP MLAల రాసలీలల వీడియోలపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్..

శ్రీరాముడు వలస కూలి.. నటుడు ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ రోజు దేశ చరిత్రలోనే గొప్ప రోజుగా మిగిలిపోతుంది

Photos

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

+5

ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)