కొత్త కారు కొనేవారికి రూ.55,000 వరకు ఆఫర్‌!

Published on Thu, 04/16/2026 - 08:29

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన అమ్మకాలతో దేశంలోనే మూడో అతిపెద్ద కార్ల తయారీదారుగా (మారుతీ సుజుకీ, మహీంద్రా తర్వాత) నిలిచిన టాటా మోటార్స్ అదే జోరును కొనసాగించేందుకు ఏప్రిల్ నెలలో ఆఫర్లను ప్రకటించింది. తన పాపులర్ ఐసీఈ (పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ) మోడళ్లపై ఏకంగా రూ.55,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది.

హ్యుందాయ్‌ను దాటేసిన టాటా!

గత ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) విభాగం ఊహించని వృద్ధిని సాధించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 5,53,585 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు 2026 నాటికి 14.05% వృద్ధిని నమోదు చేస్తూ 6,31,387 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ ఘనతతో హ్యుందాయ్ మోటార్ ఇండియాను వెనక్కి నెట్టి టాటా మూడో స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు?

వినియోగదారుల డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ డిస్కౌంట్ రూపంలో ఈ రాయితీలు లభిస్తాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

మోడల్గరిష్ఠ డిస్కౌంట్
టాటా కర్వ్ (Curvv)రూ. 55,000
టాటా హారియర్ (Harrier)రూ. 45,000
టాటా సఫారీ (Safari)రూ. 45,000
టాటా ఆల్ట్రోజ్ (Altroz)రూ. 35,000
టాటా నెక్సాన్ (Nexon)రూ. 30,000
టాటా టియాగో (Tiago)రూ. 30,000
టాటా టిగోర్ (Tigor)రూ. 30,000

 

పోటీ మార్కెట్‌లో హోరాహోరీ

వేసవి సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రధాన కంపెనీలన్నీ పోటీ పడుతున్నాయి. మారుతీ సుజుకీ తన కార్లపై గరిష్టంగా రూ.2.15 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించగా, హ్యుందాయ్ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.60,000 వరకు తగ్గింపు ఇస్తోంది. వాటితో పోలిస్తే టాటా ఆఫర్లు తక్కువగా అనిపించినప్పటికీ సేఫ్టీ రేటింగ్స్, సరికొత్త డిజైన్ల కారణంగా టాటా కార్లకు డిమాండ్ భారీగా ఉందని కంపెనీ అధికారలు చెబుతున్నారు.

గమనిక: పైన పేర్కొన్న డిస్కౌంట్లు సీటీ, డీలర్‌షిప్, స్టాక్ లభ్యతను బట్టి మారుతుంటాయి. కచ్చితమైన ధర, ఆఫర్ల కోసం మీ సమీపంలోని అధికారిక షోరూమ్‌ను సంప్రదించగలరు.

ఇదీ చదవండి: లాభాలు ఎలా రాబట్టుకుంటారో ఏమో!

Videos

మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా.. అనవసర అరెస్టులు, రిమాండ్లు..

బైక్ ను 100 స్పీడ్ లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే.. రికార్డైన వీడియోలో..!

మీకంత దైర్యం ఉంటే.. మీడియా ముందుకు వచ్చి చెప్పండి..

తేల్చుకుందాం.. ఆ నొప్పి ఎలా ఉంటదో చూపిస్తాం.. చెవిరెడ్డి మాస్ వార్నింగ్

విద్యలోకి రాజకీయాలు? స్కూల్ పేపర్ లో లడ్డు కల్తీ ప్రశ్న

జగనన్న కోసం పని చేస్తున్నందుకు నా జన్మ ధన్యం అయింది.. పొన్నవోలు ఎమోషనల్

డబుల్ ధమాకా..! ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

టీడీపీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పై పేర్ని నాని, వల్లభనేని వంశీ ఫిర్యాదు

ఫిషింగ్ హార్బర్లపై హక్కు మత్స్యకారులదే.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Photos

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్‌పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)

+5

మత్స్యకారులతో వైఎస్‌ జగన్‌ మమేకం (ఫొటోలు)

+5

తిరుమలలో పండగ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త (ఫొటోలు)

+5

మెరిసిపోతున్న నభా నటేశ్ (ఫొటోలు)