భారత్‌ వృద్ధి వేగవంతం 

Published on Thu, 04/16/2026 - 06:27

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, 2027లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం వృద్ధిని నమోదు చేయనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. 2026లో 6.5 శాతం వృద్ధి అంచనాతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని పేర్కొంది. భారత వస్తువులపై అమెరికా అదనపు టారిఫ్‌లను 50 శాతం నుంచి10 శాతానికి తగ్గించడం వంటి సానుకూల అంశాలు వృద్ధికి దోహదం చేస్తాయని ఐఎంఎఫ్‌ పేర్కొంది. మధ్యప్రాచ్యంలో ఘర్షణల కారణంగా ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, ఈ సానుకూలతల అండతో 2026లో వృద్ధి రేటు 0.3 శాతం మెరుగుపడి 6.5 శాతానికి చేరుతుందని, 2027లో కూడా ఇదే వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది.  

ప్రపంచ వృద్ధి రేటు తగ్గొచ్చు.. 
ఇరాన్‌ యుద్ధంతో ప్రంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిందంటూ, దీని ఫలితంగా 2025లో వృద్ది రేటు తగ్గుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. 2026లో వృద్ధి అంచనాను 3.3 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గించింది. 2025లో నమోదైన 3.4 శాతం వృద్ధితో పోలిస్తే తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. 2027లోనూ 3.2 శాతానికి వృద్ధి రేటు తగ్గుతుందని తెలిపింది. అంతేకాదు ఈ ఏడాదికి ద్రవ్యోల్బణం అంచనాలను లోగడ ప్రకటించిన (జనవరిలో) అంచనా 3.8 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. యుద్ధానికి ముందు వరకు అమెరికా టారిఫ్‌లను ఎదుర్కొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలంగానే నిలబడిందని.. డేటా సెంటర్లు, ఏఐపై భారీ పెట్టుబడులు, ఉత్పాదక పెరగడం ఆర్థికంగా అనుకూలించినట్టు విశ్లేషించింది. అయితే, పశ్చిమాసియాలో యుద్ధం ఈ వేగానికి అడ్డుపడిందని ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్త పీర్నే ఒలీవర్‌ పేర్కొన్నారు.  

Videos

మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా.. అనవసర అరెస్టులు, రిమాండ్లు..

బైక్ ను 100 స్పీడ్ లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే.. రికార్డైన వీడియోలో..!

మీకంత దైర్యం ఉంటే.. మీడియా ముందుకు వచ్చి చెప్పండి..

తేల్చుకుందాం.. ఆ నొప్పి ఎలా ఉంటదో చూపిస్తాం.. చెవిరెడ్డి మాస్ వార్నింగ్

విద్యలోకి రాజకీయాలు? స్కూల్ పేపర్ లో లడ్డు కల్తీ ప్రశ్న

జగనన్న కోసం పని చేస్తున్నందుకు నా జన్మ ధన్యం అయింది.. పొన్నవోలు ఎమోషనల్

డబుల్ ధమాకా..! ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

టీడీపీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పై పేర్ని నాని, వల్లభనేని వంశీ ఫిర్యాదు

ఫిషింగ్ హార్బర్లపై హక్కు మత్స్యకారులదే.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Photos

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్‌పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)

+5

మత్స్యకారులతో వైఎస్‌ జగన్‌ మమేకం (ఫొటోలు)

+5

తిరుమలలో పండగ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త (ఫొటోలు)

+5

మెరిసిపోతున్న నభా నటేశ్ (ఫొటోలు)