అలర్ట్: రేపటి నుంచి ఈ బ్యాంక్‌ అకౌంట్లు క్లోజ్‌!

Published on Wed, 04/15/2026 - 17:39

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపయోగంగా ఉన్న లక్షలాది ఖాతాలను రేపటి (ఏప్రిల్ 16) నుండి శాశ్వతంగా మూసివేయాలని బ్యాంక్ యాజమాన్యం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇతర ప్రభుత్వ బ్యాంకుల బాటలోనే పీఎన్‌బీ కూడా ఈ కఠిన చర్యలకు ఉపక్రమించడం బ్యాంకింగ్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

ఎవరి ఖాతాలు మూతపడతాయి?
మీడియా నివేదికల ప్రకారం.. ఈ కింది కేటగిరీల కిందకు వచ్చే ఖాతాలను బ్యాంక్ మూసివేయనుంది.
మూడేళ్లుగా లావాదేవీలు లేనివి: గత మూడేళ్లుగా కనీసం ఒక్కసారి కూడా వాడని ఖాతాలు.
జీరో బ్యాలెన్స్: ఖాతాలో జీరో బ్యాలెన్సు ఉండి, చాలా కాలంగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాలు.
కేవైసీ అప్‌డేట్ లేనివి: గడువులోపు e-KYC (ఈ-కేవైసీ) పూర్తి చేయని ఖాతాలపై బ్యాంక్ వేటు వేసే అవకాశం ఉంది.

ఎందుకీ కఠిన నిర్ణయం?
బ్యాంకులో వేల సంఖ్యలో నిరుపయోగంగా పడి ఉన్న ఖాతాల వల్ల మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని బ్యాంక్ భావిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా, అలాగే బ్యాంక్ డేటాను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో క్రమానుగతంగా ఇటువంటి చర్యలు చేపడుతుంటారు.

ఖాతాను కాపాడుకోవాలంటే..
మీ ఖాతా క్లోజ్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ కింది పనులు పూర్తి చేయండి:
మీ సమీపంలోని పీఎన్‌బీ బ్రాంచ్‌కు వెళ్లి వెంటనే ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.
మీ అకౌంట్‌లో కొంత మొత్తాన్ని జమ చేయండి.
కనీసం ఒక చిన్న లావాదేవీ (డ్రా చేయడం లేదా జమ చేయడం) చేయడం ద్వారా అకౌంట్ యాక్టివ్‌గా ఉందని నిర్ధారించుకోండి.

తీసుకెళ్లాల్సిన పత్రాలు
ఈ పనుల నిమిత్తం బ్యాంకుకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, విద్యుత్ లేదా నీటి బిల్లు (అడ్రస్ ప్రూఫ్ కోసం), బ్యాంక్ పాస్‌బుక్ ఒరిజినల్ పత్రాలతో పాటు వాటి ఫోటోకాపీలను (జిరాక్స్) వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి.
ఇదీ చదవండి: పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు

Videos

మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా.. అనవసర అరెస్టులు, రిమాండ్లు..

బైక్ ను 100 స్పీడ్ లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే.. రికార్డైన వీడియోలో..!

మీకంత దైర్యం ఉంటే.. మీడియా ముందుకు వచ్చి చెప్పండి..

తేల్చుకుందాం.. ఆ నొప్పి ఎలా ఉంటదో చూపిస్తాం.. చెవిరెడ్డి మాస్ వార్నింగ్

విద్యలోకి రాజకీయాలు? స్కూల్ పేపర్ లో లడ్డు కల్తీ ప్రశ్న

జగనన్న కోసం పని చేస్తున్నందుకు నా జన్మ ధన్యం అయింది.. పొన్నవోలు ఎమోషనల్

డబుల్ ధమాకా..! ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

టీడీపీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పై పేర్ని నాని, వల్లభనేని వంశీ ఫిర్యాదు

ఫిషింగ్ హార్బర్లపై హక్కు మత్స్యకారులదే.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Photos

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్‌పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)

+5

మత్స్యకారులతో వైఎస్‌ జగన్‌ మమేకం (ఫొటోలు)

+5

తిరుమలలో పండగ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త (ఫొటోలు)

+5

మెరిసిపోతున్న నభా నటేశ్ (ఫొటోలు)