సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
Breaking News
ఆ హీరోయిన్ ఇంటికొస్తే.. నా కొడుకు భయపడేవాడు: అక్షయ్ కుమార్
Published on Tue, 04/14/2026 - 18:30
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు తన కొత్త సినిమా ‘భూత్ బంగ్లా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు ఆరవ్ కుమార్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. భూల్ భులయ్య సినిమా చూసి..ఆరేళ్ల పాటు విద్యాబాలన్‌కి దూరంగా ఉన్నాడని..ఆమె ఇంటికి వస్తే భయపడిపోయేవాడని చెప్పాడు.

మంజులిక అనుకొని..
2007లో విడుదలైన భూల్ భులయ్య సినిమా నా కొడుకుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ సినిమా చూసిన తర్వాత ఆరేళ్ల పాటు అందులో నటించిన విద్యాబాలన్‌ని చూసి భయపడిపోయాడు. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడల్లా..భయంతో వణికిపోయేవాడు. ఆమె కళ్లల్లోకి చూసేవాడు కాదు. అతను ఆమెలో మంజులిక(భూల్ భులయ్యలో విద్యాబాలన్ పోషించిన పాత్ర పేరు) చూసేవాడు. అందుకే ఆమె వస్తుందంటే భయంతో పారిపోయేవాడు. నేనే అతన్ని ఓదార్చి.. ఆమె మంజులిక కాదని, విద్యాబాలన్ అని..మంచి అమ్మాయి అని చెప్పాల్సి వచ్చింది. అయినా కూడా ఆరేళ్ల పాటు నమ్మలేకపోయాడు’ అని అక్షయ్ అన్నారు.
అదే తేడా
భూత్ బంగ్లా, భూల్ భులయ్యా చిత్రాల మధ్య తేడాలను వివరిస్తూ.. 'భూత్ బంగ్లా' ఒక హారర్ ఫాంటసీ; ఇది ఒక డిస్నీ సినిమా లాంటిది. 'భూల్ భులయ్యా' ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అది మొదలైనప్పుడు, ఆమె దెయ్యం పట్టినట్లు కనిపిస్తుంది, కానీ తర్వాత అది ఒక మానసిక సమస్య అని తెలుస్తుంది. 'భూత్ బంగ్లా'లో , వధుసూర్(రాక్షసుడు) ఎలా వచ్చాడో, అతను ఎందుకు అలా చేస్తున్నాడో మేము వివరించాం. ఈ సినిమా చూసి పిల్లలను కూడా ఎంజాయ్ చేస్తారు’ అని అక్షయ్ చెప్పుకొచ్చాడు.
Tags : 1