Breaking News

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌.. కథ మళ్లీ మొదటికొచ్చిందా?

Published on Tue, 04/14/2026 - 06:33

రజనీకాంత్‌ 173వ చిత్రం గురించి ఏ ముహూర్తాన అనుకున్నారో గాని అది ఇప్పటి వరకు సెట్‌ కావడం లేదు. రజనీకాంత్‌ ప్రస్తుతం నెల్సన్‌ దర్శకత్వం జైలర్‌–2 చిత్రాన్ని పూర్తిచేశారు. ఈ చిత్రం జూలై నెలలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. తదుపరి నటుడు కమలహాసన్‌ తన రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించనున్న చిత్రంతో పాటు, కమలహాసన్‌తో కలిసి నటించే చిత్రానికి రజనీకాంత్‌ కమిట్‌ అయ్యారు. కమల్, రజినీ కలిసి నటించే చిత్రానికి దర్శకుడు నెల్సన్‌ పేరు ఖరారు అయ్యింది. అయితే దానికి ముందు రజనీకాంత్‌ హీరోగా కమలహాసన్‌ నిర్మించనున్న చిత్రానికే దర్శకుడు ఇంకా నిర్ణయం కాలేదు. మొదట ఈ చిత్రానికి సుందర్‌.సి పేరు ఖరారైంది. 

దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అలాంటిది ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగినట్లు దర్శకుడు సుందర్‌.సి ప్రకటించి షాక్‌ ఇచ్చారు. దీంతో రజనీకాంత్‌ తనకు కథ పూర్తిగా సంతృప్తి కలిగిన తరువాతే షూటింగ్‌కు వెళ్తామని కమలహాసన్‌ ప్రకటించారు. దీంతో కథ సెట్‌ కాకపోవడంతోనే సుందర్‌.సి ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు అర్థమైంది. ఆ తరువాత ఈ చిత్రానికి డాన్‌ చిత్రం ఫేమ్‌ సిబి.చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం కథ సింగిల్‌ విన్న రజనీకాంత్, కమలహాసన్‌ బాగుందని ఈ దర్శకుడికి పచ్చజెండా ఉంటారని సమాచారం. 

ఈ చిత్రం అందరినీ సంతృప్తి పరుస్తుందని  దర్శకుడు సిబి.చక్రవర్తి ఇటీవల లవ్‌ టుడే చిత్ర వేదికపై బలంగా చెప్పారు. అంతే కాకుండా ఈ చిత్రం మే నెలలో సెట్‌ పైకి వెళుతుంద న్న ప్రచారం జరుగుతోంది. అలాంటిది పరిస్థితుల్లో ఈ చిత్రం నుంచి సిబి.చక్రవర్తి కూడా వైదొలగినట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచా రం వైరల్‌ అవుతోంది.అంతే కాదు ఈ చిత్రానికి డ్రాగన్‌ చిత్రం ఫేమ్‌ అశ్వద్‌ మారి ముత్తు దర్శకత్వం వహిస్తారనే ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది. 

Videos

ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై

డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు, మలుపు తిరుగుతోన్న మంగ్లీ వివాదం

పిల్లల భవిష్యత్తు అంధకారం? బడి లేక గుడిలో చదువు..

అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి

తండ్రి కొడుకులపై కుతకుత లాడిన అచ్చెన్నాయుడు

ఇదెక్కడి ఫ్రెండ్లీ పోలీసింగ్..? ఆత్మహత్య చేసుకున్న శివ కార్తికేయ

దళిత మహిళపై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రాజు

100 ఏళ్లలో ఎపుడు చూడని ఎండ, ఆ రెండు గంటలు బయటికి రాకండి

నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం

ఇరాన్ అమెరికా రెండో విడత శాంతి చర్చ

Photos

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)