Breaking News

ఉజ్జీవన్ బ్యాంక్ దరఖాస్తు తిరస్కరించిన ఆర్‌బీఐ

Published on Mon, 04/13/2026 - 21:14

మైక్రోఫైనాన్స్ రంగం నుంచి పూర్తిస్థాయి బ్యాంకింగ్‌ వైపు అడుగులు వేస్తున్న ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) షాక్ ఇచ్చింది. యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం బ్యాంక్ సమర్పించిన దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించింది. రుణాల పంపిణీలో మరింత వైవిధ్యం అవసరమని పేర్కొంటూ కేంద్ర బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆర్‌బీఐ అభ్యంతరం ఏమిటి?

స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఉజ్జీవన్ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం, బ్యాంక్ లోన్ పోర్ట్‌ఫోలియోపై ఆర్‌బీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉజ్జీవన్ రుణాలు ఎక్కువగా ఒకే రకమైన విభాగాలకు (ప్రధానంగా అన్ సెక్యూర్డ్ మైక్రో లోన్స్) పరిమితమై ఉన్నాయి. రుణాలను వైవిధ్యపరచడానికి బ్యాంక్ ఇటీవల చేసిన ప్రయత్నాలను ఆర్‌బీఐ గుర్తించినప్పటికీ ఒక యూనివర్సల్ బ్యాంక్‌కు ఉండాల్సిన సమతుల్య లోన్‌ బుక్‌ ఇంకా సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో రుణాల పంపిణీని మరింత విస్తృతం చేసిన తర్వాతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌బీఐ సలహా ఇచ్చింది.

యూనివర్సల్ బ్యాంక్ హోదా ఎందుకు ముఖ్యం?

స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్థాయి నుంచి యూనివర్సల్ బ్యాంక్‌గా మారితే బ్యాంకుకు కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అందులో.. చిన్న రుణాలు, తక్కువ సేవలందించే విభాగాలకే పరిమితం కాకుండా కార్పొరేట్ బ్యాంకింగ్ వంటి అన్ని రకాల ఆర్థిక సేవలను అందించవచ్చు. ప్రాధాన్యత రంగ రుణ నిబంధనల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. యూనివర్సల్ బ్యాంక్‌గా మారితే కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడంతో పాటు తక్కువ వడ్డీ రేటుకే నిధులను సేకరించడానికి దోహదపడుతుంది.

ఇదీ చదవండి: ఇరాన్‌ సమీపంలో అమెరికా నౌకా దళాలు

Videos

ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై

డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు, మలుపు తిరుగుతోన్న మంగ్లీ వివాదం

పిల్లల భవిష్యత్తు అంధకారం? బడి లేక గుడిలో చదువు..

అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి

తండ్రి కొడుకులపై కుతకుత లాడిన అచ్చెన్నాయుడు

ఇదెక్కడి ఫ్రెండ్లీ పోలీసింగ్..? ఆత్మహత్య చేసుకున్న శివ కార్తికేయ

దళిత మహిళపై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రాజు

100 ఏళ్లలో ఎపుడు చూడని ఎండ, ఆ రెండు గంటలు బయటికి రాకండి

నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం

ఇరాన్ అమెరికా రెండో విడత శాంతి చర్చ

Photos

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)