Breaking News

టెక్‌ దేశానికి వీసా ఫీజులు పెరుగుతున్నాయ్‌..!

Published on Mon, 04/13/2026 - 12:38

జపాన్‌లో నివసిస్తున్న విదేశీయులకు, అక్కడికి వెళ్లాలనుకునే వారికి ఆ దేశ ప్రభుత్వం షాకింగ్ వార్త చెప్పింది. ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ యాక్ట్‌కు సవరణలు చేయడం ద్వారా వీసా పునరుద్ధరణ (Renewal), శాశ్వత నివాస (Permanent Residency) రుసుములను భారీగా పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఏజెన్సీ ప్రతినిధి జపాన్ పార్లమెంటు దిగువ సభలో వివరాలను వెల్లడించారు.

ప్రతిపాదిత కొత్త ఫీజుల వివరాలు
ప్రస్తుత నిబంధనల ప్రకారం వీసా గడువుతో సంబంధం లేకుండా పునరుద్ధరణకు కేవలం 6,000 యెన్లు మాత్రమే వసూలు చేస్తున్నారు. అయితే కొత్త సవరణల ప్రకారం ఈ ధరలు ఆకాశాన్నంటనున్నాయి. 5 ఏళ్ల వీసా రెన్యువల్ కోసం ప్రస్తుతమున్న ఫీజు ఏకంగా 70,000 యెన్లకు పెరగనుంది. స్వల్పకాలిక వీసా (3 నెలలు అంతకంటే తక్కువ) పునరుద్ధరణకు సుమారు 10,000 యెన్లు ఖర్చవుతుంది. ఇక శాశ్వత నివాసం (PR) ఫీజు అత్యంత భారీగా పెంచుతున్నారు. ప్రస్తుతం 10,000 యెన్లు ఉన్న పీఆర్ రుసుము, ఏకంగా 2,00,000 యెన్లకు పెరగనుంది.

గరిష్ట పరిమితులు ఖరారు చేసిన ప్రభుత్వం
ఫీజుల పెంపుపై ప్రభుత్వం కేబినెట్ ఆమోదం కోసం ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ యాక్ట్ సవరణలను సమర్పించింది. ఇందులో భాగంగా గరిష్ట ఫీజు పరిమితులను కూడా నిర్ణయించింది. శాశ్వత నివాసం కోసం గరిష్టంగా 3,00,000 యెన్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఇతర వీసా కేటగిరీలకు గరిష్టంగా 1,00,000 యెన్ల వరకు పరిమితి విధించారు. 

అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దరఖాస్తుదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. అర్హతను బట్టి వారికి ఫీజులో తగ్గింపు లేదా పూర్తి మినహాయింపు ఇచ్చే నిబంధనలను కూడా అధికారులు పొందుపరిచారు.

పెంపునకు కారణం ఏంటి?
మారుతున్న పరిపాలనా అవసరాలు, ఇమ్మిగ్రేషన్ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే క్రమంలో ఈ ఫీజుల సర్దుబాటు తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, పర్యవేక్షణ ఖర్చులను భర్తీ చేయడానికి ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.

#

Tags : 1

Videos

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్

89 బూతులలో ఓట్లే పడలేదు.. EVMల మాయ గెలుపే.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

అమ్మకానికి అమరావతి!

విద్యార్థులకు ప్రేమ కవితలు పంపుతున్న ట్రిపుల్‌ ఐటీ అధ్యాపకులు

పొప్ పై విరుచుకుపడ్డ డోనాల్డ్ ట్రంప్

అతనికి శ్రీముఖి అంటే క్రష్.. ఫేమ్ కోసమే ఇందంతా ..!

ఎడ్ల బండిలో పెండ్లి పిల్ల

8 నిమిషాల్లో 8 లక్షల కోట్లు ఆవిరి

హైకోర్టు తిట్టినా మారరా.. తలుపులు పగలగొట్టి.. బెడ్ రూమ్ లోకి వచ్చి

ముంబై ఇండియన్స్.. హ్యాట్రిక్ ఓటమి

Photos

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

తమిళ హీరోయిన్‌ అతుల్య రవి డీసెంట్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

‘పాపం ప్రతాప్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)