Breaking News

హెల్త్‌ ఇన్సూరెన్స్‌.. మీ ‘ప్లాన్‌’ ఏంటి?

Published on Mon, 04/13/2026 - 06:29

చందన (38) ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఆమె భర్త (44) ఓ చిన్న వ్యాపార సంస్థను నిర్వహిస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. వీరి కుటుంబానికి రూ.5 లక్షల సమ్‌ ఇన్సూర్డ్‌తో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ ఉంది. చందన ఆటో ఇమ్యూన్‌ (లూపస్‌) వ్యాధిని ఎదుర్కొంటోంది. ఆమె భర్తకు మధుమేహం, బీపీ, స్థూలకాయం సమస్యలున్నాయి. వివేక్‌ (40) ఓ బ్యాంకులో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేస్తున్నాడు. ఆయన భార్య (35) గృహిణి. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరికి కూడా రూ.5 లక్షల కవరేజీతో బేసిక్‌ ఇండెమ్నిటీ హెల్త్‌ప్లాన్‌ ఉంది. చూడ్డానికి హెల్త్‌ కవరేజీ సమానమే. కానీ ఇక్కడి రెండు కుటుంబాల ఆరోగ్య చరిత్ర వేరు.

 కుటుంబ సభ్యుల సంఖ్య వేరు. మనలో చాలా మంది బీమా విషయంలో ఒకే ధోరణిని అనుసరిస్తుండడాన్ని గమనించొచ్చు. కానీ, అందరికీ ఒకే తరహా ప్లాన్, అందరికీ ఒకే విధమైన రక్షణ కవరేజీ అన్నది ఎంత మాత్రం సమంజసం కాదన్న విషయాన్ని గుర్తించాలి. 25 ఏళ్లు, 60 ఏళ్ల వయసులో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునే వారి మధ్య ప్రాధాన్యతలు, ఆరోగ్య సమస్యలు, రిస్క్‌ ఒకే విధంగా ఉండవు. అందుకే ప్రతీ కుటుంబం కూడా తమ ఆరోగ్య చరిత్ర, వయసు, సభ్యుల సంఖ్య ఆధారంగా మెరుగైన కవరేజీతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉండేలా చూసుకోవాలి. ఇందుకు ఏం చేయాలన్నది ఈ వెల్త్‌ స్టోరీలో చూద్దాం.  

వయసు కీలకం..
→ ఒకే తరహా బీమా పాలసీ అందరికీ అనుకూలమని చెప్పలేం.  
→ వైద్య విభాగంలో ద్రవ్యోల్బణం 10–12 శాతంగా ఉంటోంది. అంటే ఏటా చికిత్సలు, ఔషధాలు ఇలా మొత్తం మీద వాటి వ్యయాలు ఈ మేరకు పెరుగుతున్నాయి.   
→ మారిన ఆహార నియమాలు, పని వేళలు, తక్కువ శ్రమ కారణంగా జీవనశైలి వ్యాధుల ముప్పు పెరిగిపోయింది. 30 ఏళ్ల నుంచే మధుమేహం, బీపీ, థైరాయిడ్‌ సమస్యలు సాధారణమయ్యాయి. కేన్సర్ల రిస్క్‌ మన దేశంలో వేగంగా పెరుగుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
→ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రక్షణ సమగ్రంగా లేకపోతే పొదుపు, పెట్టుబడులన్నీ కరిగిపోయే రిస్క్‌ ఎదురవుతుంది.  
→ కనుక హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కేవలం రక్షణ సాధనమే కాదు. ఆర్థిక ప్రణాళికలో ఇదొక భాగం. ఆర్థిక సంక్షోభ నివారణ సాధనం.

25–35 ఏళ్ల వారికి.. 
ప్రధాన లక్ష్యం
తక్కువ ప్రీమియంపై అధిక కవరేజీ ఉండేలా చూసుకోవాలి. 
ఎంపిక 
→ అవివాహితులు అయితే వ్యక్తిగత హెల్త్‌ ఇన్సూరెన్స్, వివాహితులు అయితే కుటుంబం అంతటికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ ఎంపిక చేసుకోవచ్చు. 
→ కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల సమ్‌ ఇన్సూర్డ్‌తో బేసిక్‌ ఇండెమ్నిటీ  ప్లాన్‌ తీసుకోవాలి. 
→ బేసిక్‌ ప్లాన్‌ కవరేజీలో తీసుకున్నంత మేర (రూ.5–10 లక్షలు) డిడక్టబుల్‌ పెట్టుకుని, రూ.20–25 లక్షలకు సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ కొనుగోలు చేయాలి.  
→ ఇలా చేయడం వల్ల ఒక ఏడాదిలో ఆస్పత్రి బిల్లు బేసిక్‌ ప్లాన్‌ కవరేజీని మించినప్పుడు, సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ నుంచి చెల్లింపులు లభిస్తాయి.

వీటిపై దృష్టి పెట్టాలి
→ నో క్లెయిమ్‌ బోనస్‌ (ఎన్‌సీబీ) ఉండేలా చూసుకోవాలి. 
→ బీమా సంస్థ హాస్పిటల్‌ నెట్‌వర్క్‌ను పరిశీలించాలి. ఎన్ని ఎక్కువ ఆస్పత్రులు జాబితాలో ఉంటే అంత మంచిది. ముఖ్యంగా తాము నివసించే ప్రాంతంలోని ముఖ్యమైన ఆస్పత్రులు బీమా నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్నాయేమో చూసుకోవాలి. దీనివల్ల వైద్యం అవసరమైనప్పుడు సులభంగా క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌ పొందడం వీలు పడుతుంది. 
→ చిన్న వయసు వల్ల తక్కువ ప్రీమియంతోపాటు ఎలాంటి వ్యాధుల్లేకపోవడం అనుకూలం. అన్ని వెయిటింగ్‌ పీరియడ్‌ (కొన్ని వ్యాధులకు కవరేజీ)లను ఈజీగా అధిగమించొచ్చు.  

ఈ తప్పులు వద్దు.. 
→ నేను ఆరోగ్యవంతుడిని కదా, ఇంత చిన్న వయసులో నాకు ఆరోగ్య బీమా ఎందుకు? అన్న ఆలోచన తప్పు. ఆరోగ్య సమస్యలే రానక్కర్లేదు. ప్రమాదం కారణంగా ఆస్పత్రి పాలై క్లిష్టమైన చికిత్సలు అవసరమైతే బిల్లు వాచిపోవచ్చు. 
→ పనిచేసే సంస్థ నుంచి గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉంది కదా చాలులే అనుకోవద్దు. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయినా లేదా సంస్థను వీడినా సొంతంగా బీమా రక్షణ ఉండదు.

30–50 ఏళ్ల వయసు..
ప్రధాన లక్ష్యం
→ కుటుంబం అంతటికీ సరైన రక్షణ కల్పించుకోవడం ఈ వయసు వారికి ప్రధాన లక్ష్యంగా ఉండాలి. కవరేజీ–ప్రీమియం మధ్య సమతూకం ఉండాలి.

ఏది అనుకూలం? 
→ ఈ వయసులో దాదాపు అధిక శాతం వివాహం చేసుకుని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కనుక వీరికి ఫ్యామిలీ ఫ్లోటర్‌ సరైనది. అవివాహితులైతే ఇండివిడ్యువల్‌ హెల్త్‌ ప్లాన్‌ తీసుకోవచ్చు. 
→ కుటుంబం మొత్తానికి కవరేజీ బేసిక్‌ ప్లాన్‌లో రూ.10–25 లక్షలు ఉండేలా చూసుకోవాలి. అదే ఇండివిడ్యువల్‌ ప్లాన్‌లో రూ.5–10 లక్షలు సరిపోతుంది. 
→ రూ.25–50 లక్షలతో సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ తీసుకోవచ్చు. బేసిక్‌ ప్లాన్‌లో కవరేజీ మేర డిడక్టబుల్‌ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఒక్కరికైనా, కుటుంబానికైనా సూపర్‌ టాపప్‌తో అదనపు రక్షణ అనేది ఈ రోజుల్లో ఎంతో అవసరం.

కీలక ప్రాధాన్యతలు వీటికి.. 
→ పెళ్లై పిల్లల కోసం ప్లాన్‌ చేసుకునే వారు తాము తీసుకునే హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో మెటరి్నటీ (ప్రసవ సంబంధిత) కవరేజీ తప్పక ఉండేలా చూసుకోవాలి. 
→ మధ్య వయసు దృష్ట్యా డే కేర్‌ ప్రొసీజర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.  
→ హాస్పిటల్‌లో చేరక ముందు, డిశ్చార్జ్‌ అయిన తర్వాత కూడా అదే సమస్యకు సంబంధించి తీసుకునే చికిత్సకు కవరేజీ ఉండాలి. ఇప్పుడు చాలా ప్లాన్లు 90–120 రోజుల వరకు చేరక ముందు, డిశ్చార్జ్‌ అయిన తర్వాత కవరేజీని ఇస్తున్నాయి. 
→ రూమ్‌ రెంట్‌కు సంబంధించి ఎలాంటి పరిమితులు లేకపోతే మేలు. 
→ వ్యాధులకు సంబంధించి ఉప పరిమితులు (చెల్లింపుల్లో) ఉండకూడదు. 
→ కో–పేమెంట్‌ విషయంలో (ప్రతీ క్లెయిమ్‌లో పాలసీ దారు తన వంతు చెల్లించాల్సిన మొత్తం) దూరంగా ఉండాలి. 
→ బేసిక్‌ ప్లాన్, సూపర్‌ టాపప్‌తో తక్కువ ప్రీమియానికి మెరుగైన కవరేజీ లభిస్తుంది.  

50 ఏళ్లు దాటిన వారికి.. 
వీటికి ప్రాధాన్యం..
→ అప్పటికే ఉన్న వ్యాధులతోపాటు అన్ని రకాల కవరేజీలు ఉన్న ప్లాన్‌ అవసరం. 
→ ఈ వయసులో ఫ్యామిలీ ఫ్లోటర్‌ కంటే కూడా ఇండివిడ్యువల్‌ హెల్త్‌ ప్లాన్‌ మేలు. 
→ బేసిక్‌ ప్లాన్స్‌లో రూ.10లక్షల కవరేజీకి అదనంగా 50 లక్షలతో సూపర్‌ టాపప్‌ తీసుకోవాలి.

వీటిని చూడాలి..
→ ముందు నుంచి ఉన్న వ్యాధులకు కవరేజీని ఆఫర్‌ చేసే ప్లాన్‌ తీసుకోవాలి. సాధారణంగా పాలసీ తీసుకునే నాటికి ఉన్న వ్యాధులకు సంబంధించి కవరేజీ పొందాలంటే కనీసం 3–4 ఏళ్లు ఆగాలి. అప్పటికే ఉన్న వ్యాధులకు సంబంధించి వ్యయాలకు పాలసీదారు సొంతంగా ఖర్చు చేసుకోవాలి. కొన్ని సంస్థలు కాస్త అదనపు ప్రీమియంతో వెయిటింగ్‌ పీరియడ్‌ను తగ్గించేందుకు/మాఫీ చేసేందుకు అనుమతిస్తున్నాయి.  
→ ఒకవేళ వెయిటింగ్‌ పీరియడ్‌ క్లాజు ఉన్నా, సాధ్యమైనంత తక్కువ ప్లాన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. 
→ క్లెయిమ్‌ చెల్లింపుల రేషియో ఎక్కువ ఉన్న బీమా సంస్థ అయితే నయం. అదే సమయంలో ఆయా బీమా సంస్థ సేవలు బాగున్నాయేమో చూసుకోవాలి.

రిస్క్‌లు..
→ ఈ వయసులో పాలసీలకు కంపెనీలు అధిక ప్రీమియం నిర్ణయిస్తుంటాయి. 
→ అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా కొన్ని బీమా సంస్థలు పాలసీ ఇవ్వడానికి నిరాకరించొచ్చు.  

ఇవి అందరికీ.. 
→ వయసు ఏదైనప్పటికీ అధిక కవరేజీ ఉంటే ఎంతో మంచిది. కనీసం రూ.20 లక్షలు అంతకంటే అధికం (సూపర్‌ టాపప్‌) ఉండేలా చూసుకోవాలి. 
→ ఆస్పత్రుల నెట్‌వర్క్‌ను ప్రధానంగా చూడాలి. ఎక్కువ ఆస్పత్రుల్లో, అందులోనూ పేరున్న ఆస్పత్రులు అన్నీ ఉంటే మంచిది. 
→ రూమ్‌ రెంట్‌లకు సంబంధించి పరిమితులు, కో–పేమెంట్, వ్యాధుల వారీ పరిమితులు ఏవీ లేకుండా చూసుకోవాలి. 
→ పాలసీ తీసుకునే ముందు పాలసీ వర్డింగ్స్‌ డాక్యుమెంట్‌ ఆసాంతం చదివి.. అందులో సదుపాయాలు, మినహాయింపుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. 
→ గడువులోపు పాలసీని తప్పక రెన్యూ చేసుకోవాలి. దీనికి ఆటో డెబిట్‌ యాక్టివేట్‌ చేసుకోవాలి.

– సాక్షి, వెల్త్‌

Videos

లెక్క సెట్ చేస్తాం.. 2029లో చూపిస్తా..

అల్లు అర్జున్ రాకాపై షారుఖ్ షాకింగ్ కామెంట్స్..

టీడీపీ ఎమ్మెల్యే బంధువు అరాచకం.. తోటకు రమ్మని.. బాధిత మహిళ ఆవేదన

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్

89 బూతులలో ఓట్లే పడలేదు.. EVMల మాయ గెలుపే.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

అమ్మకానికి అమరావతి!

విద్యార్థులకు ప్రేమ కవితలు పంపుతున్న ట్రిపుల్‌ ఐటీ అధ్యాపకులు

పొప్ పై విరుచుకుపడ్డ డోనాల్డ్ ట్రంప్

అతనికి శ్రీముఖి అంటే క్రష్.. ఫేమ్ కోసమే ఇందంతా ..!

ఎడ్ల బండిలో పెండ్లి పిల్ల

Photos

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

తమిళ హీరోయిన్‌ అతుల్య రవి డీసెంట్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

‘పాపం ప్రతాప్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)