Breaking News

నా కూతురి రూపంలో ఆమె తిరిగొచ్చింది.. పూర్ణ ఎమోషనల్

Published on Sun, 04/12/2026 - 12:42

హీరోయిన్, సహాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ.. గత నెలలో మరోసారి తల్లయింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ చిన్నారి నూలేకెట్టి వేడుకని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ విషయాన్ని చెప్పిన పూర్ణ.. తన కూతురు ఫొటోలని తొలిసారి పంచుకుని, ఆమెకు పెట్టిన పేరు గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఇన్ స్టాలో అసభ్యకర కంటెంట్.. యాంకర్ విష్ణుప్రియపై కేసు)

'జమీలా అనేది నా అమ్మమ్మ పేరు. చిన్నప్పుడే కోల్పోయిన ఆమె జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు గనక కూతురు పుడితే ఆమె పేరే పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. నా కుమార్తెని ఒడిలోకి తీసుకున్న ఆ క్షణం.. అమ్మమ్మ నా దగ్గరకు తిరిగి వచ్చినట్లుగా అనిపించింది. పాప పుట్టడం మా కుటంబానికి అపారమైన ఆనందాన్ని తీసుకొచ్చింది' అని పూర్ణ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది.

పాప పుట్టన తర్వాత 28వ రోజున నూలేకెట్టి వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారమని.. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొని చిన్నారికి ఆశీర్వాదాలు అందించారని.. హమ్దాన్ పెద్ద అన్నయ్యగా మారి కుటుంబంలో కొత్త బాధ్యతను స్వీకరించాడని పూర్ణ చెప్పుకొచ్చింది. 'దువా జమీలా'కి కుటుంబం ప్రేమ, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని రాసుకొచ్చింది.

కేరళకు చెందిన ఈమె.. సీమటపాకాయ్, అవును తదితర సినిమాలతో తెలుగులో గుర్తింపు సాధించింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ మూవీస్ చేసింది. ప్రస్తుతం సహాయ పాత్రలు చేస్తూ, టీవీ షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది. చివరగా 'అఖండ 2'లో కనిపించింది. వ్యక్తిగత విషయానికొస్తే 2022లో దుబాయికి చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్‌ని పెళ్లి చేసుకుంది. 2023లో ఈ దంపతులకు బాబు పుట్టగా, ఇప్పుడు పాప జన్మించింది.

(ఇదీ చదవండి: 'వారణాసి'లో ఆ సాధువులంతా క్రిమినల్స్: తమిళ హీరో)

Videos

కీర్తనను చంపింది నిజమే.. శిక్ష వేయండి.. ఎన్ కౌంటర్ చేయొద్దు

శాంతి చర్చలు విఫలం.. పాక్ ఆందోళన..

షూతో తన్నుతూ.. నా భార్య ముందే బూతులు తిడుతూ..

ఆమె సాక్ష్యం చెప్తుందని ఎవరు ఊహించలేదు.. వాళ్ళకి శిక్ష రద్దయితే రేవతి పరిస్థితి ఇదే.

ఆశా భోస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

చిక్కుల్లో విష్ణు ప్రియ.. అసభ్యకర ఫోటోలు పెట్టి సబ్ స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూల్

సంగీత ప్రపంచానికి తీరని లోటు..

ABN రాధాకృష్ణ కు సపోర్ట్ చేస్తూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్

ఎక్కడ ఆపాడో అక్కడ్నుంచే మొదలెట్టాడు.. చెన్నైలో చితకొట్టిన చెట్టా...

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

Photos

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

తమిళ హీరోయిన్‌ అతుల్య రవి డీసెంట్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

‘పాపం ప్రతాప్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)