Breaking News

'సమోసా' ఎక్కడి వంటకమో తెలుసా..?!

Published on Fri, 04/10/2026 - 17:03

"సమోసా" అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఈ చిరుతిండి బయటకు కరకరలాడుతూ..లోపల కారంగా స్పైసీగా ఉంటుంది. వీధి ధుకాణాలలో ప్రధాన స్నాక్స్‌ ఐటెం ఇది. వేడి వేడి టీ తోపాటు ఒక్క సమోసా తింటే అబ్బా ప్రాణం లేచొచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి ప్రజాదరణ కలిగిన ఈ వంటకం మన భారతదేశానికి చెందిన వంటకం కాదట. ఇది ఎక్కడ నుంచి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.

ఈ సమోస మూలాలకు సంబంధించిన కథ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ సమోసా స్టోరీ గురించి చరిత్ర, పురావస్తు శాస్త్రలలో పీహెచ్‌డీ చేసిన పరిశోధకుడు, రచయితగా చెప్పుకునే డాక్టర్‌ ఎంఎఫ్‌ ఖాన్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌ చేశారు. ఆయన తన పోస్ట్‌లో సమోసా మెదట ఎలా ఉండేది, మన పాకనిపుణులను దాని తయారీని ఎలా మార్చారు వంటి వాటి గురించి సవివరంగా రాసుకొచ్చారు. 1500..1510ల మధ్య రాసిన పర్షియన్‌ తాళప్రత్రం గ్రంథలో దీని గురించి సవివరంగా రాసి ఉందని చెబుతున్నాడు. 

ఈ గ్రంథం ఆధారంగా అత్యధికంగా తినే వీధి ఆహారమైన సమోసా 500 ఏళ్ల నాటి వంటకంగా పేర్కొన్నాడు. బ్రిటీష్‌ మ్యూజియంలో ఉన్న ఈ తాళపత్ర గ్రంథంలో పర్షియన్‌ భాషలో ఈ సమోసా వంటకం గురించి రాసి ఉందని తెలిపాడు. ఈ చిరుతిండి అప్పట్లో చాలా భిన్నమైన రూపాన్ని కలిగి ఉండేదని చెప్పాడు. నాటి పూర్వీకులు ఈ వంటకాన్ని కాల్చిన వంకాయ గుజ్జు, ఎండు అల్లం, గొర్రె మాంసం, వంటివి నూనెల వేయించి..దాన్ని లోపలి స్టఫ్‌గా పెట్టి వండేవారని పేర్కొన్నాడు. 

కానీ మనం ప్రస్తుతం చూసే సమోసాలు అందుకు చాలా విభిన్నం. ఇప్పుడు వాటిల్లో బంగాళదుంపలు, ఉల్లిపాయల కూర వంటివి స్టఫ్‌గా పెట్టి వండేస్తున్నాం. పైగా జతగా వేయించిన పచ్చిమిర్చి ఇస్తుంటాం. నిజానికి అప్పుడు ఇలా ఈ రెండూ ఉండేవి కావని అన్నారు. ఆ తాళ్లపత్రాల ఆధారంగా మొఘల్ చక్రవర్తి అక్బర్, టిప్పు సుల్తాన్‌ చేతుల మీదుగా ప్రయాణించి..మన దేశంలోకి వచ్చిందని చెప్పారు. 

వీధి చిరుతిండిగా దొరకక ముందు నాటి సమోసా ఇది.. అని అన్నారు. అంటే ఇది రాజరికపు వంటకంగా మొదలై వీధి దుకాణపు ఫేమస్‌ స్నాక్స్‌ ఐటెంగా మారిందని చెప్పుకొచ్చారు. నెటిజన్లు ఈ పోస్ట్‌ని చూసి..అంటే ఈ సమోసా మన దేశంలోకి వలస వచ్చిందన్న మాట అని హాస్యస్పదంగా పోస్టులు పెట్టారు.

మితంగానే మంచిది..
ఆరోగ్య నిపుణుల మాటల ప్రకారం.. సమోసాలో అధిక మొత్తంలో నూనె, చక్కెర స్థాయిలు ఉంటాయనేది వాస్తవం. వీటిని మోతాదుకు మించి తీసుకుంటే అనారోగ్యానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఒక సమోసాలో 11 నుంచి 12 గ్రాముల ఆయిల్‌ ఉంటుందని అంచనా. ఇలాంటి ఆహార పదార్థాలు రోజూ తింటే..ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు

 

(చదవండి: నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్‌చేస్తే..)

 

#

Tags : 1

Videos

అమెరికా నష్టపరిహారం చెల్లించాల్సిందే.. మీ ఇష్టం మళ్లీ యుద్ధమే!

బయటపడ్డ ఏపీపై చంద్రబాబు కపట ప్రేమ

చంద్రబాబు తెలంగాణకు షాడో సీఎం, జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

చర్చలు విఫలమైతే మళ్లీ యుద్ధం మొదలవుతుందా?

కావాలనే నాపై తప్పుడు ప్రచారం... లాయర్‌పై సింగర్ మంగ్లీ ఫిర్యాదు

కారుపై పడ్డ కాంక్రీట్ లారీ

విమానంలో రక్తంతో తడిసిన బ్యాగులు, బూట్లు.. ఇరాన్ ఎమోషనల్ పోస్ట్!

మొయినాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

మద్యం తాగి పోలీసులపై రెచ్చిపోయిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అనుచరులు

కేసీఆర్ తో దోస్తీ...రేవంత్ తో కటీఫ్.. పొలిటికల్ ఫ్యూచర్‌పై క్లారిటీ..

Photos

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)