Breaking News

అక్కడ మృతదేహాలను కాల్చరు, పూడ్చరు..!

Published on Fri, 04/10/2026 - 13:53

కొన్ని చోట్ల చాలా వింతైన ఆచారాలు ఉంటాయి. అవి వినడానికి ఎంత వింతగా అనిపించినా..వాటి వెనుకున్న మర్మం చాలా ఆశ్చర్యానికిలోనూ చేయడమే గాక ఆధ్యాత్మికంగా ఆలోచింప చేసేలా ఉంటాయి. అలానే ఇక్కడ ఓ గ్రామంలోని ఖననం చేసే పద్ధతులు ఎంత వింతగా ఉంటాయంటే..నోట మాటరాదు. వామ్మో..! ఇదేం పద్ధతి అనిపించేలా ఉంటుంది.

ఆ విచ్రితమైన పద్ధతి ఇండోనేషియాలోని బాలిలోని ట్రున్యాన్‌ గ్రామం ఆచరిస్తోంది. అక్కడ మృతదేహాలను ఖననం చేసే పద్ధతి చాలా విభిన్నంగా ఉంటుంది. అక్కడ మరణాన్ని భూగర్భంలో దాచరు, అగ్నిలో దహించరు, దానికి బదులుగా బహిరంగంగా గాలిలోకి వదులుతారు. ​​బటూర్ సరస్సు కాల్డెరా ఒడ్డున ఉన్న ఈ బాలి గ్రామం, ప్రధాన బాలి హిందూ ఆచారాల కంటే పురాతనమైన ఖనన పద్ధతులను అనుసరిస్తోంది. 

ఇక్కడ మరణానికి భయపడరు, దాన్ని జీవిత చక్రంలో ఒక భాగంగా భావిస్తారు. అదొక అనుభవంగా అంగీకరిస్తారు. త్రున్యాన్‌ చేరుకోవడం అంత సులభం కాదు. బటూర్‌ సర్సుల మీదుగా పడవలో 15 నిమిషాల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడి నిశ్చలమైన వాతావరణ ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ ఖనన పద్ధతిని మెపాసా అని పిలుస్తారు. దహనం లేదా ఖననం చేయడానికి బదులుగా, మృతదేహాన్ని పవిత్రమైన తారు మెన్యాన్ చెట్టు కింద ఆరుబయట ఉంచుతారు. 

మృతదేహాలను కడిగి, ముఖం కనపడేలా తెల్లటి వస్త్రంలో చుడతారు. ఆ తర్వాత వాటిని సాధారణ వెదురు బోనులో ఉంచుతారు. . వ్యక్తిగత వస్తువులు, కొన్నిసార్లు ఫోటోలు కూడా వాటి పక్కనే ఉంచుతారు. ఇలా వివాహం చేసుకుని సహజపద్ధతిలో మరణించిన వారిని మాత్రమే ఇక్కడికి తీసుకువస్తారు. పిల్లలు, అవివాహితులు, లేదా ప్రమాదాలలో మరణించిన వారిని వేరే ఖనన ప్రదేశాలకు తీసుకువెళ్తారు. అంతేగాదు ఇక్కడ మృతదేహాల సంఖ్య కూడా పరిమితంగానే ఉంటుంది. కేవలం 11 వెదురు బోనులు మాత్రమే ఉంటాయి. కొత్త మృతదేహం వచ్చినప్పుడు, స్థలం నిండిపోయినప్పుడు అత్యంత పురాతన అవశేషాలను గౌరవప్రదంగా తొలగిస్తారు. 

పుర్రెలను సమీపంలోని రాతి వేదికపై ఉంచుతారు. ఎముకలను ఆ ప్రదేశం చుట్టూ అమర్చుతారు. అయితే ఆ మెన్యాన్‌ చెట్టు పేరు మీదుగానే ఆ గ్రామానికి పేర్కొచ్చింది. ఇది సువాసన వెదజల్లే చెట్టు. ఇది మృతదేహం కుళ్లిపోవడం వల్లే వచ్చే దుర్వాసనను తటస్థీకరిస్తుందిన స్థానికులు నమ్మకం. ఆశ్చర్యకరంగా అక్కడకు వచ్చే సందర్శకులకు సైతం అక్కడ ఎలాంటి చెడువాసన రాకపోవడం గమనార్హం. 

దీనికి గల కారణం..
ట్రున్యాన్ ప్రజలకు, శరీరం అనేది వ్యక్తి కాదు. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, మిగిలింది కేవలం ఒక పాత్ర మాత్రమే, ఇక అవసరం లేని బట్టల లాంటిది. ఇది పునర్జన్మ అనే నమ్మకానికి సంబంధించినది. ఇక్కడ మరణం అంతం కాదు, కేవలం ఒక పరివర్తన. 

ఈ బహిరంగ ప్రక్రియ దిగ్భ్రాంతి కలిగించడానికి ఉద్దేశించినది కాదు, కానీ ఎలాంటి జోక్యం లేకుండా ప్రకృతి తన పని తాను చేసుకునేందుకు వీలు కల్పించడం కోసం అని అక్కడ ప్రజల నమ్మకం . అలాగే ఇక్కడ కొన్ని ఆచారాలకు మహిళలను అనుమతించరు.

 

(చదవండి: ఐఐటీ,గేట్‌లలో టాపర్‌, పీహెచ్‌డీ పట్టభద్రుడు కానీ..!)

 

#

Tags : 1

Videos

జనసేన జయప్రకాష్‌పై కేసు నమోదు

అగ్రరాజ్యానికి ఇరాన్ గట్టి సవాల్ ఇరాన్ వ్యూహం ఏంటీ..?

గులాబీ దళపతి కేసీఆర్‌తో భేటీ

జగన్‌పై షర్మిల వ్యాఖ్యలు, రాచమల్లు అదిరిపోయే కౌంటర్

వరంగల్ లో మందుబాబుల వీరంగం

డెకాయిట్ మూవీ ఫస్ట్ రివ్యూ

ఒకప్పుడు నా మిత్రుడు.. నాపై చేసిన కామెంట్స్ మాత్రం.. రఘురామా వ్యాఖ్యలపై జడ రియాక్షన్

సెలూన్ షాప్ కు 70 లక్షల GST.. కంగుతిన్న సెలూన్ షాప్ ఓనర్

గల్ఫ్ దేశాలను చీకట్లోకి నెడుతున్న ఇరాన్

12 ఆగస్టు 2026 ఆకాశంలో పగలంతా చీకటి

Photos

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)