Breaking News

రఫేల్‌ డీల్.. ‘స్వదేశీ’ అస్త్రాలకు పెద్దపీట!

Published on Fri, 04/10/2026 - 10:38

భారత వాయుసేన(ఐఏఎఫ్‌)లో సుమారు రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో కొనుగోలు చేయనున్న 114 రఫేల్‌ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంఆర్‌ఎఫ్‌ఏ) ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిబంధనను చేర్చబోతోంది. ఈ యుద్ధ విమానాల్లో భారతీయ క్షిపణులు, ఆయుధ వ్యవస్థలను ఏకీకృతం చేసేందుకు వీలుగా ‘ఇంటర్‌ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్’ (ఐసీడీ)ను ఒప్పందంలో అంతర్భాగం చేయాలని భారత్ నిర్ణయించుకుంది.

ఏమిటీ ఐసీడీ? దీని ప్రాముఖ్యత ఏంటి?

సాధారణంగా ఏ దేశమైనా ఇతర దేశాల నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేసినప్పుడు ఆ విమానాల తయారీ సంస్థలు తమ సొంత క్షిపణులను మాత్రమే వాడుకునేలా సాఫ్ట్‌వేర్ కట్టడి చేస్తాయి. అయితే, రాబోయే 114 రాఫెల్ విమానాల విషయంలో భారత్ భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. తుది ఒప్పందంలో ఐసీడీలో మార్పులు చేయడంతో భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన అత్యాధునిక క్షిపణులు రఫేల్‌ వ్యవస్థతో అనుసంధానం కావడానికి మార్గం సుగమం అవుతుంది.

దీనివల్ల భవిష్యత్తులో మనం ఫ్రాన్స్ నుంచి ఖరీదైన క్షిపణులను కొనాల్సిన అవసరం లేకుండా దేశీయ టెక్నాలజీతో గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణులను, ఇతర స్వదేశీ బాంబులను ఈ విమానాల ద్వారా ప్రయోగించవచ్చు.

మేక్ ఇన్ ఇండియాకు ఊతం

ఫిబ్రవరి 12న డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఈ భారీ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. వచ్చే నెలలో డసో ఏవియేషన్ సంస్థకు ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ (ఆర్‌ఎఫ్‌పీ) జారీ కానుంది. మొత్తం 114 విమానాలలో 18 విమానాలు నేరుగా ఫ్రాన్స్ నుంచి సిద్ధంగా వస్తాయి. మిగిలిన 96 విమానాలు 25 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌లోనే తయారవుతాయి. ఇది దేశీయ రక్షణ రంగ తయారీలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

సోర్స్ కోడ్ వివాదంపై స్పష్టత

సోర్స్ కోడ్ బదిలీ విషయంలో వస్తున్న అపోహలను రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కొట్టిపారేశారు. ఏవియానిక్స్, రాడార్, ఫ్లైట్ కంట్రోల్ వంటి కీలక విధులను నియంత్రించే సోర్స్ కోడ్‌ను పంచుకోకపోవడం అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక ప్రామాణిక పద్ధతి. భారత్‌కు అత్యంత సన్నిహిత దేశాలైన రష్యా (Su-30 MKI విషయంలో), అమెరికా కూడా తమ సోర్స్ కోడ్‌లను ఎవరికీ పంచుకోవు. అయినప్పటికీ, ఐసీడీ ద్వారా సాఫ్ట్‌వేర్ అనుసంధానత లభిస్తుంది కాబట్టి, సోర్స్ కోడ్ లేకపోయినా మన ఆయుధాలను వాడుకోవడానికి ఎటువంటి ఆటంకం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 40 శాతం రాయితీపై రష్యా ఎల్‌ఎన్‌జీ?

Videos

వాటర్ తో గేమ్స్ వద్దు.. ఒక సెల్ఫీ మూడు ప్రాణాలు

నల్లగా ఉన్నాడని లవర్తో మొగుణ్ణే లేపించేసింది

మోనాలిసాకు బిగ్ షాక్ భర్త ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు

మీ అన్నను చంపించింది నువ్వే అని టాక్... అచ్చెన్నకు గుబాపగిలేలా సజ్జల కౌంటర్

వేసిన 20 రోజులకే ఖతం చేతులతో తవ్వితే ఊడిపోతున్న రోడ్డు

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

చిరు ఆగ్రహం

హరూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్స్

MAVIGUN పై షర్మిల జోకర్ కామెంట్స్ సజ్జల సెటైర్స్ అదుర్స్

ఎర్రంనాయుడు మరణంలో నీ హస్తం లేదా? అచ్చెన్న పై తమ్మినేని సీతారాం షాకింగ్ నిజాలు

Photos

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)