Breaking News

'జన నాయగణ్' సినిమా మొత్తం లీక్.. ఇది ఎవరి పని?

Published on Fri, 04/10/2026 - 00:39

ప్రస్తుతం తమిళనాడులోని ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న స్టార్ హీరో, దళపతి విజయ్‌కి లీకువీరులు పెద్ద షాకిచ్చారు. 'జన నాయగణ్' సినిమా మొత్తాన్ని లీక్ చేశారని సమాచారం. తొలుత 5 నిమిషాల సీన్స్ అని అంతా అనుకున్నారు. కానీ మూవీనే సోషల్ మీడియాలో కనిపించేసరికి అభిమానులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ట్విటర్, ఇన్ స్టా, ఫేస్‌బుక్ ఈ చిత్రం గురించే పెద్ద చర్చ నడుస్తోంది.

రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విజయ్, 'జన నాయగణ్' తన చివరి సినిమా అని ప్రకటించారు. లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ సమస్యల కారణంగా, కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఇప్పటికీ అలానే ఉండిపోయింది. ఎట్టకేలకు తమిళనాడు ఎన్నికలు జరిగిన తర్వాత రిలీజ్ చేస్తారని నిర్మాతలు అనుకుంటున్నట్లు కొన్ని వార్తలొచ్చాయి. ఇంతలోనే నష్టం జరిగిపోయింది. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న మూవీ మొత్తం పైరసీకి గురైనట్లు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

'జన నాయగణ్' సినిమా.. తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి'కి రీమేక్‌గా తెరకెక్కించారు. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. తెలుగులో శ్రీలీల చేసిన పాత్రని తమిళంలో మమిత బైజు చేసింది. అయితే సినిమాని లీక్ చేసింది ఎవరా అని ప్రస్తుతం డిస్కషన్ నడుస్తోంది. మూవీ టీమ్ నుంచి ఎవరైనా లీక్ చేశారా? లేదంటే ప్రత్యర్థి పార్టీలు విజయ్‌పై ఇలా కుట్ర చేస్తోందా? అని అనుకుంటున్నారు.

Videos

ఎద్దులా పెరిగావ్ కానీ బుర్ర లేదు.. అచ్చన్నకు ఇచ్చిపడేసిన బొత్స

కాంగ్రెస్ కు గుడ్ బై BRSలోకి జీవన్ రెడ్డి..

నాసాలో చీకటి కోణం.. సంచలన విషయాలు బయటపెట్టిన NASA మాజీ శాస్త్రవేత్త

కంటతడి పెట్టిన బొత్స

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో భారీగా 'మావిగన్' ఫ్లెక్సీలు

మామను చంపిన నువ్వు తల్లి, చెల్లి గురించి మాట్లాడతావా.. నీ మొహానికి సిగ్గుందా..!

ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం

నీ తల్లిని తిట్టినా.. నీకు సిగ్గులేకపోవొచ్చు.... బాబు ఇంట్లో ఆడవాళ్లే నీకు... పేర్ని కిట్టు సంచలన కామెంట్స్

సంతకం ఫోర్జరీ, CMRFలో 8 లక్షలు కొట్టేసిన TDP నేత

వామ్మో ఏందయ్యా ఇది... Swiggy, Zomatoలో ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ తింటున్నారా?

Photos

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)

+5

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడలో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్‌షిప్” (ఫొటోలు)

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)