ఎద్దులా పెరిగావ్ కానీ బుర్ర లేదు.. అచ్చన్నకు ఇచ్చిపడేసిన బొత్స
Breaking News
నెలాఖర్లో థ్రిల్
Published on Fri, 04/10/2026 - 00:03
‘అర్ధనారి, తెప్ప సముద్రం, వెడ్డింగ్ డైరీస్’ చిత్రాలు, ‘బిగ్ బాస్’ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా నటించిన తాజా చిత్రం ‘పరమపద సోపానం’. ఈ చిత్రంలో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించారు. నాగ శివ దర్శకత్వంలో గణపర్తి శ్వేత సమర్పణలో గణపర్తి నారాయణరావు తేల్ర΄ోలు, ప్రసన్న ఆంజనేయులు నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లుగా వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
‘ పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు పులగం సుప్రియ సహ నిర్మాతగా వ్యవహరించగా, దేవ్ జాండ్ సంగీతం అందించారు. మరోవైపు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ఓ కీలక పాత్రలో అర్జున్ అంబటి నటిస్తున్నారు.
Tags : 1