Breaking News

ఆ రైడ్‌కి ఐదు స్టార్‌లు..! కించెత్తు సంభాషణకు నో ఛాన్స్‌..

Published on Thu, 04/09/2026 - 17:05

అత్యంత అరుదుగా ఎదురయ్యే రైడ్‌ ఇది. దీనికి మాటలతో పనిలేదు. ఈ అసాధారణమైన రైడ్‌ని టెక్నాలజీ మాటలతో పనిలేకుండానే సమన్వయం అయ్యేలా చేసింది. ఎలా సాగుతుందో అనుకున్న జర్నీ కాస్తా సాంకేతికత అద్భుతమైన ముగింపు ఇచ్చి దివ్యాంగుల్లో ధైర్యాన్ని నూరిపోసింది. అందుకు సంబంధించని పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

ఈ పోస్ట్‌ని గ్రెయిల్‌మేకర్ ఇన్నోవేషన్స్ సహ-వ్యవస్థాపకురాలు ఐశ్వర్య టి వి పిళ్లై లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో ఆమె తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె ఒక రోజు రైడ్‌ని బుక్‌ చేసినట్లు తెలిపారు. అది కన్ఫర్మ్‌ అయ్యింది. డ్రైవర్‌ చెవిటివాడని, అర్థమైంది. తాను అంధురాలు కాబట్టి ఆ రైడ్‌  ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉందామెకు.  ఆ రైడ్‌ని రద్దు చేద్దామనుకుంది కానీ ఆ తర్వాత ఏ జరుగుతుందో చూడాలనే కుతుహలంతో ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. అనుకున్నట్లుగానే క్యాబ్‌ వచ్చింది. 

తాను చేతికర్రతో సహా లోపలికి ఎక్కాను కాబట్టి ఆ డ్రైవర్‌కి తన పరిస్థితి అర్థమయ్యే ఉంటుందని భావించింది. తాను ఫోన్‌లో ఏదో టైప్‌ చేస్తున్నట్లుగా ఓపెన్‌ చేసి అతడికి ఓటీపీ చూపించింది. ఆ తర్వాత ఆమె తాను వెళ్లే ఆఫీస్‌ ఎంట్రీ వద్ద నేరుగా దించమని టెక్స్ట్‌ మెసేజ్‌ పంపింది. ఆ ఉబర్‌ డ్రైవర్‌ అర్థం చేసుకున్నాడు. గమ్యస్థానం రాగానే అతను కారు దిగి ఎవరినో పిలిచాడు. ఆ తర్వాతన ఆమె కారు దిగింది. 

ఇంతలో సెక్యూరిటీ గార్డు వచ్చి ఆమెన ప్రవేశ ద్వారం వద్దకు నడిపించాడు. కించెత్తు సంభాషణ కూడా లేకుండా అంతా అర్థమయ్యేలా సాఫీగా సాగిపోయిందా ఆజర్నీ. ఆ రైడ్‌కి నిజంగా ఐదు స్టార్‌లు అంటూ పోస్ట్‌ని ముగించింది పిళ్లై. నెజిజన్లు కూడా ఈ పోస్ట్‌పై ప్రశంసల జల్లు కురిపించడమే గాక, వైకల్యాలను అధిగమించేలా చేసిన సాంకేతిక అద్భుతం అని కొనియాడారు.

(చదవండి: ఆ ఐపీఎస్‌ జంట వివాహంలో..హాట్‌టాపిక్‌గా ‘దూద్ పిలాయ్’ ఆచారం!)

 

#

Tags : 1

Videos

ఎద్దులా పెరిగావ్ కానీ బుర్ర లేదు.. అచ్చన్నకు ఇచ్చిపడేసిన బొత్స

కాంగ్రెస్ కు గుడ్ బై BRSలోకి జీవన్ రెడ్డి..

నాసాలో చీకటి కోణం.. సంచలన విషయాలు బయటపెట్టిన NASA మాజీ శాస్త్రవేత్త

కంటతడి పెట్టిన బొత్స

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో భారీగా 'మావిగన్' ఫ్లెక్సీలు

మామను చంపిన నువ్వు తల్లి, చెల్లి గురించి మాట్లాడతావా.. నీ మొహానికి సిగ్గుందా..!

ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం

నీ తల్లిని తిట్టినా.. నీకు సిగ్గులేకపోవొచ్చు.... బాబు ఇంట్లో ఆడవాళ్లే నీకు... పేర్ని కిట్టు సంచలన కామెంట్స్

సంతకం ఫోర్జరీ, CMRFలో 8 లక్షలు కొట్టేసిన TDP నేత

వామ్మో ఏందయ్యా ఇది... Swiggy, Zomatoలో ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ తింటున్నారా?

Photos

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)

+5

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడలో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్‌షిప్” (ఫొటోలు)

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)