ఎద్దులా పెరిగావ్ కానీ బుర్ర లేదు.. అచ్చన్నకు ఇచ్చిపడేసిన బొత్స
Breaking News
'విశ్వంభర' విడుదల తేదీ వైరల్
Published on Thu, 04/09/2026 - 16:46
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ‘విశ్వంభర’. విడుదల తేదీ గురించి నెట్టంట ఒక వార్త వైరల్ అవుతుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సుమారు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో చిత్ర నిర్మాతలు విఎఫ్ఎక్స్ (VFX)పై ఎక్కువ సమయం కేటాయించడంతో విడుదల విషయంలో ఆలస్యమైంది.
తాజా అంచనాల ప్రకారం విశ్వంభర చిత్రం 2026 జూలై 10న థియేటర్లలోకి రావచ్చన ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో పలు తేదీలు ప్రచారంలో ఉండగా.. ఈ తేదీపైనే అందరి చూపు ఉంది. అయితే, అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ చాలా ఆలస్యం అయినందున, విడుదల తేదీ ప్రకటనను వీడియో కంటెంట్‌తో చేస్తే మరింత బజ్ క్రియేట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఆ విధంగా, కొత్త తేదీ ప్రేక్షకుల మనసుల్లో బలంగా నాటుకుపోతుందని చెప్పుకొస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న చిరంజీవి మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య తర్వాత దర్శకుడు బాబీతో మరో సినిమాను పట్టాలెక్కించారు. త్వరలో షూటింగ్‌లో కూడా చిరు పాల్గొననున్నారు.
Tags : 1