Breaking News

ఒక వైపు 30వేల లేఆఫ్స్.. మరోవైపు రూ.270 కోట్ల ఆఫర్!

Published on Thu, 04/09/2026 - 16:45

ప్రముఖ టెక్ దిగ్గజం 'ఒరాకిల్' ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించి వార్తల్లో నిలిచింది. ఇలాంటి సమయంలో కంపెనీ చీప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (CFO)గా హిలరీ మ్యాక్సన్‌ను భారీ వేతనంతో నియమించింది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చకు దారితీసింది.

ఒరాకిల్ కొత్త సీఎఫ్ఓ హిలరీ మ్యాక్సన్‌కు కంపెనీ 9,50,000 డాలర్ల జీతం ఇవ్వనుంది. అదనంగా పనితీరు ఆధారంగా 2.5 మిలియన్ డాలర్ల వరకు బోనస్ పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా 26 మిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ (షేర్లు) కూడా సంస్థ అందిస్తుంది. వీటిలో 80 శాతం సమయానికి అనుసంధానమైనవి కాగా, 20 శాతం పనితీరుపై ఆధారపడి ఉంటాయి.

మ్యాక్సన్ తన ఈక్విటీని పూర్తిగా స్టాక్ ఆప్షన్ల రూపంలో లేదా స్టాక్ ఆప్షన్లు, రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ల రూపంలో తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా కంపెనీ ఆమెకు 2,50,000 విలువైన రీలోకేషన్ అలవెన్స్ కూడా అందిస్తోంది. ఇవన్నీ కలిగి ఆమె మొత్తం ప్యాకేజీ సుమారు 29.7 మిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.273 కోట్లు) చేరుకుంటుంది.

హిలరీ మ్యాక్సన్‌ ఒరాకిల్‌లో చేరడానికి ముందు.. ష్నైడర్ ఎలక్ట్రిక్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఎఫ్ఓగా పనిచేశారు. అంతే కాకుండా ఆమె ఏఈఎస్ కార్పొరేషన్‌లో 12 సంవత్సరాలు పాటు ఫైనాన్స్, స్ట్రాటజీ మొదలైన విభాగాల్లో పాటు కీలక బాధ్యతలు నిర్వహించారు.

కంపెనీ భారీ లేఆఫ్స్
ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ భారీ లేఆఫ్ ప్రభావం భారతదేశంలో సుమారు 12,000 మంది ఉద్యోగులపై పడింది. కంపెనీ ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం.. కంపెనీ నిర్మాణ మార్పులు, ఖర్చు తగ్గింపు చర్యలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అని తెలుస్తోంది. ఈ కోతలు ఒరాకిల్ హెల్త్, సేల్స్, క్లౌడ్, కస్టమర్ సక్సెస్, నెట్‌సూట్‌లోని సిబ్బందిని ప్రభావితం చేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి: రూ.80 లక్షల ప్యాకేజ్.. అందులో రూ.40 లక్షలు కిడ్నాపర్లకు!

#

Tags : 1

Videos

ఎద్దులా పెరిగావ్ కానీ బుర్ర లేదు.. అచ్చన్నకు ఇచ్చిపడేసిన బొత్స

కాంగ్రెస్ కు గుడ్ బై BRSలోకి జీవన్ రెడ్డి..

నాసాలో చీకటి కోణం.. సంచలన విషయాలు బయటపెట్టిన NASA మాజీ శాస్త్రవేత్త

కంటతడి పెట్టిన బొత్స

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో భారీగా 'మావిగన్' ఫ్లెక్సీలు

మామను చంపిన నువ్వు తల్లి, చెల్లి గురించి మాట్లాడతావా.. నీ మొహానికి సిగ్గుందా..!

ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం

నీ తల్లిని తిట్టినా.. నీకు సిగ్గులేకపోవొచ్చు.... బాబు ఇంట్లో ఆడవాళ్లే నీకు... పేర్ని కిట్టు సంచలన కామెంట్స్

సంతకం ఫోర్జరీ, CMRFలో 8 లక్షలు కొట్టేసిన TDP నేత

వామ్మో ఏందయ్యా ఇది... Swiggy, Zomatoలో ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ తింటున్నారా?

Photos

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)

+5

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడలో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్‌షిప్” (ఫొటోలు)

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)