బిజినెస్ మ్యాన్ తో పెళ్లైంది... నలుగురు పిల్లలు ఉన్నారు
Breaking News
అసలు మీరేం మాట్లాడుతున్నారు?.. గంగూలీకి నటి స్ట్రాంగ్ కౌంటర్..!
Published on Wed, 04/08/2026 - 19:36
మాజీ టీమిండియా సారథి సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ఇటీవల భోలేబాబా పార్ కరేగా' అనే బెంగాలీ సీరియల్ షూటింగ్‌లో నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ మరణించడంపై మాజీ క్రికెటర్ గంగూలీ మాట్లాడారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇదంతా షూటింగ్ కోసమే అయినా.. అతను నీటిలోకి ఎందుకు దిగారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బెంగాలీ నటి స్వాస్తిక ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలోనూ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.
బాధలో ఉన్న ఆ కుటుంబంపై ఇలాంటి కామెంట్స్ చేయడమేంటని సౌరవ్ గంగూలీని స్వాస్తిక బెనర్జీ తప్పుపట్టింది. తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె.. గంగూలీ లాంటి గొప్ప వ్యక్తి మాట్లాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హితవు పలికింది. ఆయన మాటలు తమ వృత్తిని కించపరిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి తమ పని విలువను తగ్గిస్తాయని స్వాస్తిక ముఖర్జీ అన్నారు.
అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్రతి రంగాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని స్వాస్తిక పేర్కొన్నారు. గంగూలీ లాగా.. రాహుల్ లాంటి వాళ్లకు మద్దతు లభించదన్నారు. ఒకవేళ రాహుల్ నీటిలోకి దిగకపోయి ఉంటే.. అతని స్థానంలో మరో నటుడు వచ్చేవారని ఆమె తెలిపారు. ప్రస్తుత ఘటన చూస్తుంటే పరిశ్రమ ఎదుర్కొంటున్న విస్తృత సవాళ్లను వేలేత్తి చూపుతోందన్నారు. కాగా.. బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ మృతితో ఏప్రిల్ 7 నుంచి సినీ పరిశ్రమ అంతా నిరవధిక సమ్మెకు దిగింది.
Tags : 1