Breaking News

క్యూ4లో ఐటీ డీలా!

Published on Tue, 04/07/2026 - 05:40

ముంబై: భారతీయ ఐటీ సేవల రంగం 2025–26 ఆర్థిక సంవత్సరాన్ని నిస్తేజంగా ముగించే అవకాశముందని బ్రోకరేజ్‌ సంస్థల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నాలుగో త్రైమాసికంలో (క్యూ4) త్రైమాసికవారీ(సీక్వెన్షియల్‌) వృద్ధి మందగించవచ్చని భావిస్తున్నారు. అయితే రూపాయి బలహీనత అనుకూలతకావడంతో వార్షిక ప్రాతిపదికన కొంత మెరుగుదల కనిపించవచ్చని పేర్కొంటున్నారు. 

డిమాండ్‌  స్థిరంగా ఉన్నప్పటికీ, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, జనరేటివ్‌ ఏఐ వల్ల ధరలు నిర్ణయించే విధానంలో మార్పులు, ఒప్పందాలు కుదుర్చుకోవడంపై అనిశ్చితి పెరుగుతోందని వివరించారు. మార్చి త్రైమాసిక ఫలితాల కంటే, ఆర్థిక సంవత్సరం 2026–27 అంచనాలు(గైడెన్స్‌)పైనే మార్కెట్‌ దృష్టి కేంద్రీకృతమైనట్లు తెలియజేశారు. ప్రధానంగా వృద్ధి అవకాశాలపై స్పష్టత, ఆదాయంపై ఏఐ ప్రభావాలు, మార్జిన్ల నిలకడకు ప్రాధాన్యమున్నట్లు అభిప్రాయపడ్డారు.

వృద్ధి మందగమనం, ఏడాది చివర్లో రికవరీ
త్రైమాసిక ప్రాతిపదికన (సీక్వెన్షియల్‌గా) చూస్తే, ఎఫ్‌వై 26 నాలుగో త్రైమాసికం (క్యూ4) పనితీరు నిరుత్సాహకరంగానే ఉండవచ్చని బ్రోకరేజ్‌ సంస్థలు భావిస్తున్నాయి. టైర్‌–1 ఐటీ కంపెనీల వృద్ధి అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది. ‘‘స్థిర మారకపు విలువల ఆధారంగా టైర్‌–1 కంపెనీల వృద్ధి –1.1 శాతం నుంచి 0.9 శాతం మధ్య ఉండవచ్చు. మధ్యస్థాయి (మిడ్‌–టైర్‌) కంపెనీల వృద్ధి –1.8 శాతం నుంచి 3.4 శాతం వరకు ఉండొచ్చు’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కూడా క్యూ4ను ‘సాధారణ త్రైమాసికం’గానే అభివర్ణించింది. 

పెద్ద కంపెనీల (లార్జ్‌ క్యాప్‌) వృద్ధి –1.0 శాతం నుంచి 1.5 శాతం మధ్య ఉండవచ్చని, మిడ్‌–క్యాప్‌ కంపెనీలు మాత్రం మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తాయని పేర్కొంది. మూడో త్రైమాసికం (క్యూ3)తో పోలిస్తే, నాలుగో త్రైమాసికంలో (క్యూ4) సెలవులు లేదా తాత్కాలిక విరామాలు లేకపోవడం కొంత మద్దతు ఇచి్చంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), రిటైల్‌ రంగాలకు ఇది ఉపయోగపడింది. అయితే తక్కువ పని దినాలు, ఐచ్చిక ఖర్చులపై (డి్రస్కిషనరీ స్పెండింగ్‌) కొనసాగుతున్న అప్రమత్తత వైఖరి కారణంగా ఈ ప్రభావం కొంత మేర తగ్గింది. ఇక నాలుగో త్రైమాసికంలో వృద్ధి ప్రధానంగా డీల్‌ల విస్తరణ, విలీనాలు/కొనుగోళ్లు వల్లనేనని, డిమాండ్‌ పెరుగుదల వల్ల కాదని బ్రోకరేజ్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మార్జిన్లకు కరెన్సీ ఆసరా
దేశీయ ఐటీ కంపెనీలకు నాలుగో త్రైమాసికంలో (క్యూ4) మార్జిన్లు స్థిరంగా ఉండే అవకాశముందని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. రూపాయి బలహీనత కారణంగా కొద్దిపాటి మెరుగుదల కనిపించవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్, కోటక్‌ బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కరెన్సీ ప్రభావంతో 35 నుంచి 320 బేసిస్‌ పాయింట్ల వరకు మార్జిన్‌ విస్తరణ సాధ్యమని భావిస్తున్నాయి. అయితే ఇది స్థిరమైన వృద్ధి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేతనాల పెంపు, కొత్త డీల్‌ల ప్రారంభ ఖర్చులు, ఉత్పాదకత ఆధారిత ధరల విధానం మార్జిన్లపై ఒత్తిడిని కొనసాగిస్తున్నాయి. మొత్తం మీద, స్వలకాలంలో రూపాయి బలహీనత మార్జిన్లకు కొంత ఊరటనిచి్చనా, దీర్ఘకాలంలో స్థిరమైన వృద్ధికి నిర్మాణాత్మక మార్పులు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

విలీనాలు–కొనుగోళ్లు, నియామకాల ప్రభావం
ప్రధాన ఐటీ కంపెనీలు ఆర్థిక సంవత్సరంలో భారీగా విలీనాలు, కొనుగోళ్లు (ఎం–ఏ) చేపట్టాయి. టీసీఎస్‌ కూడా దశాబ్దం తర్వాత ఈ దిశగా అడుగుపెట్టింది. కృత్రిమ మేధ, డేటా, సెమీకండక్టర్ల వంటి అనుబంధ సామర్థ్యాల కోసం ఈ కొనుగోళ్లు జరిగాయి. అయితే జనరేటివ్‌ ఏఐ ప్రభావంతో ఈ సామర్థ్యాలపై కూడా డిఫ్లేషన్‌ ఒత్తిడి ఉండొచ్చని కోటక్‌ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విలీనాలు, కొనుగోళ్లు ఆదాయ వృద్ధిపై ఎలా ప్రభావం చూపుతాయన్నది కీలకం. ఇదే సమయంలో కంపెనీల్లో నియామకాలు మందగించే అవకాశముందని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్, టెక్‌ మహీంద్రా సంస్థలు ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టాయి. తాజా నియామకాలకు ప్రాధాన్యం పెరుగుతుండగా, మధ్యస్థాయి ఉద్యోగాల నియామకాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

ఏఐ ప్రభావంతో వాల్యుయేషన్లకు కొత్త సవాలు
కృత్రిమ మేధ కారణంగా ఏర్పడే  ‘ధరల తగ్గుదల’ (డిఫ్లేషన్‌) అనేది మధ్యకాల ఆందోళన నుంచి ఇప్పుడు ఐటీ రంగం వాల్యుయేషన్లు, భవిష్యత్‌ అంచనాలను ప్రభావితం చేసే ప్రధాన అంశంగా మారింది. ‘‘ఈ డిఫ్లేషన్‌ భయాలతో ఐటీ షేర్లలో గణనీయమైన పతనం చోటుచేసుకుంది. ఐటీ సేవల ఫీజు ఇప్పుడు ‘ఏజెంట్‌–ఆగ్మెంటెడ్‌’ (ఏఐ సహాయంతో నిర్ణయించబడే విధంగా) మారుతుండగా, ఒప్పందాల పునరుద్ధరణలు తగ్గింపు ధరలతో జరుగుతున్నాయి’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. ‘‘ఏఐ ప్రభావం తక్షణ ఫలితాలకంటే భవిష్యత్‌ మార్పులపైనే ఆధారపడి ఉంటుంది. ఇక పెట్టుబడిదారుల ప్రధాన ప్రశ్న ఏఐ ప్రభావం ఉంటుందా కాదా అనేది కాదు; కంపెనీలు కొత్త ఏఐ ఒప్పందాల ద్వారా ఈ డిఫ్లేషన్‌ ప్రభావాన్ని ఎంత త్వరగా తగ్గించగలవన్నదే కీలకం’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది.

యుద్ధం ఎఫెక్ట్‌...
ఆర్థిక సంవత్సరం 2026 తొలి మూడు త్రైమాసికాల్లో  టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్‌ వంటి దిగ్గజాలు బలమైన ఆర్డర్‌బుక్స్‌తో ఆర్థిక సంవత్సరం 2027 వృద్ధిపై ఆశావహంగా ఉన్నా.., పల్చిమాసియా యుద్ధం తీవ్రతరమవడంతో పరిస్థితి మారింది. భారత ఐటీ కంపెనీలకు కీలకమైన క్లయింట్‌ సెగ్మెంట్లపై యుద్ధ ప్రభావం పడే అవకాశముంది.యుద్ధ పరిస్థితుల కారణంగా నిర్ణయాలలో జాప్యం, ఏఐ డిఫ్లేషన్‌ ప్రభావంపై మేనేజ్‌మెంట్‌ వ్యాఖ్యలు ముఖ్యమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు పూర్తిస్థాయి ఖర్చు తగ్గింపునకు దారి తీసే అవకాశాలు తక్కువేనని కోటక్‌ అభిప్రాయపడింది. మొత్తంగా ఆర్థిక సంవత్సరం 2027 డిమాండ్‌పై స్పష్టత ఇంకా అనిల్చితంగానే ఉంది. 

Videos

శభాష్ జగన్ అంటున్న కూటమి నేతలు..

మావిగన్ పేరెత్తగానే ఎందుకు అంత భయపడుతున్నారు?

RK అక్షర వ్యభిచారం..! శవాలపై చిల్లర ఏరుకోడానికి కూడా సిద్ధం

చంద్రబాబు నోటికి ప్లాస్టర్ రెచ్చిపోతున్న దగ్గుబాటి ప్రసాద్..

పచ్చ నేతల రౌడీయిజం 3 కోట్ల NRI భూమి కబ్జా

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం

శత్రుదేశంలో ఉన్న పైలట్ ను ఎలా కాపాడారు.. ఎన్ని ఆయుధాలు వాడారంటే

RBI బంపర్ ఆఫర్.. బ్యాంక్ ఎఫ్ డీలకు మించి వడ్డీ..!

జీతంలో కోత పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్

Photos

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)