Breaking News

హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్‌

Published on Mon, 04/06/2026 - 15:40

మలయాళ హీరోయిన్‌ మంజు వారియర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని పాలక్కాడ్‌లో ఓ ఈవెంట్‌కు హాజరైన మంజు వారియర్‌ను ఓ మహిళా అభిమాని బలవంతంగా ముద్దు పెట్టుకుంది. అది చూసిన అక్కడి యాంకర్‌ ఇలా ప్రవర్తించడం సరికాదని విమర్శించింది. అయితే సదరు మహిళ మాత్రం.. నాకు మంజు అక్క అంటే చాలా ఇష్టం.. అందుకే ముద్దు పెట్టుకున్నా అని బదులిచ్చింది.

ఓపికగా సెల్ఫీలు
ఇంత జరిగినప్పటికీ మంజు వారియర్‌ కోపగించుకోలేదు. ఎంతో సహనంతో మిగతా అభిమానులతో సరదాగా మాట్లాడుతూ వారితో సెల్ఫీలు దిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మంజు వారియర్‌ విషయానికి వస్తే.. ఈమె నటి మాత్రమే కాదు. డ్యాన్సర్‌, రైటర్‌, ప్రొడ్యూసర్‌, సోషల్‌ యాక్టివిస్ట్‌ కూడా! సాక్ష్యం అనే మలయాళ చిత్రంతో కథానాయికగా వెండితెరపై అరంగేట్రం చేసింది. 

సినిమా
ఈ పుళయం కాదన్ను, అసురన్‌, పాత్రం, కలియట్టం ఇలా అనేక సినిమాలు చేసింది. కన్నెళుతి పొట్టుం తొట్టు (1999) చిత్రానికిగానూ జాతీయ అవార్డు పొందింది. అయితే ఈ సినిమా తర్వాత బ్రేక్‌ తీసుకుంది. హౌ ఓల్డ్‌ ఆర్‌ యూ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. చివరగా ఎల్‌ 2: ఎంపురాన్‌ చిత్రంలో కనిపించింది. చతుర్ముఖం చిత్రంతో నిర్మాతగా మారింది. సల్లాపం అనే పుస్తకం రాసి తనలో రచయిత్రి కూడా దాగి ఉందని నిరూపించింది. అలాగే ఈమెకు వీణ వాయించడం కూడా వచ్చు.

 

 

చదవండి: పెద్దిలో ఐటం సాంగ్‌.. భలే తప్పించుకుందే!

Videos

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం

శత్రుదేశంలో ఉన్న పైలట్ ను ఎలా కాపాడారు.. ఎన్ని ఆయుధాలు వాడారంటే

RBI బంపర్ ఆఫర్.. బ్యాంక్ ఎఫ్ డీలకు మించి వడ్డీ..!

జీతంలో కోత పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్

పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొట్టిన ఇన్నోవా

రంగులు మార్చి గృహ ప్రవేశాలు చంద్రబాబు ఖాతాలోకి టిడ్కో ఇళ్లు

జగన్ పెట్టిన "GUN" అందుకే బాబు గుండెల్లో దడ...

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

అసెంబ్లీలోకి దూసుకెళ్లిన కారు, స్పీకర్ కారుపై ఇంక్ చల్లి పారిపోయిన దుండగులు

Photos

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)