Breaking News

జియో కొత్త ప్లాన్‌.. ‘నెలంతా’ వ్యాలిడిటీ

Published on Mon, 04/06/2026 - 14:33

జియో నుంచి అదిరిపోయే ప్లాన్‌! కేవలం రూ. 339లకే పూర్తి క్యాలెండర్ నెల (31 రోజులు) వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ను రిలయన్స్ జియో అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా 28 రోజుల ప్లాన్‌లతో విసిగిపోయిన కస్టమర్లకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం. ఈ కొత్త ప్లాన్ విశేషాలేంటో తెలుసుకుందాం.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 349 ప్లాన్ కంటే ఇది రూ. 10 తక్కువ ధరకే లభించడం విశేషం. ఈ ప్లాన్ ద్వారా ఏడాదికి 13 సార్లు కాకుండా, కేవలం 12 సార్లు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది.

రూ. 339 ప్లాన్ ప్రయోజనాలు
పూర్తి 31 రోజుల క్యాలెండర్ నెల వ్యాలిడిటీ.
రోజుకు 1.5 GB హై-స్పీడ్ డేటా.
ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్.
రోజుకు 100 SMSలు ఉచితం.
అదనంగా రూ. 14.95 విలువైన టాక్ టైమ్ బ్యాలెన్స్ కూడా లభిస్తుంది.
సుమారు రూ. 35,100 విలువైన 'గూగుల్ జెమిని ప్రో' సబ్‌స్క్రిప్షన్‌ను 18 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు.
ఏకంగా 5000 GB (5TB) క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్‌తో పాటు నానో బనానా (Nano Banana) సేవలకు కూడా యాక్సెస్ లభిస్తుంది.

5G వినియోగదారులకు గమనిక
ఈ ప్లాన్‌లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఒక చిన్న పరిమితి ఉంది. రూ. 349 ప్లాన్ మాదిరిగా ఇందులో అపరిమిత 5G డేటా సౌకర్యం లేదు. మీరు 5G నెట్‌వర్క్‌ను అపరిమితంగా వాడాలనుకుంటే మాత్రం రూ. 349 ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Videos

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం

శత్రుదేశంలో ఉన్న పైలట్ ను ఎలా కాపాడారు.. ఎన్ని ఆయుధాలు వాడారంటే

RBI బంపర్ ఆఫర్.. బ్యాంక్ ఎఫ్ డీలకు మించి వడ్డీ..!

జీతంలో కోత పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్

పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొట్టిన ఇన్నోవా

రంగులు మార్చి గృహ ప్రవేశాలు చంద్రబాబు ఖాతాలోకి టిడ్కో ఇళ్లు

జగన్ పెట్టిన "GUN" అందుకే బాబు గుండెల్లో దడ...

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

అసెంబ్లీలోకి దూసుకెళ్లిన కారు, స్పీకర్ కారుపై ఇంక్ చల్లి పారిపోయిన దుండగులు

Photos

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)