ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు
Breaking News
ఏడేళ్లుగా ప్రేమలో.. పెళ్లి చేసుకున్న కన్నడ హీరో
Published on Mon, 04/06/2026 - 11:20
కన్నడ హీరో సుముఖ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ప్రియురాలు మైత్రీ ఉకతో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ లవ్‌బర్డ్స్ రిషికేశ్‌లో గంగానదీ తీరంలో పెళ్లి చేసుకున్నారు. ఇరుకుటుంబాలు సహా అతి దగ్గరి బంధువుల సమక్షంలోనే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి ఫోటోలు చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సినిమా
కాగా సుముఖ.. కన్నడ ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్నాడు. యానా మూవీలో ముఖ్య పాత్ర పోషించిన ఇతడు ఫిజిక్స్ టీచర్, మానాడ కథలు చిత్రాల్లో కథానాయకుడిగా యాక్ట్ చేశాడు. ప్రస్తుతం రాజస్థాన్ డైరీస్ సహా మరో సినిమా చేస్తున్నాడు. ఇకపోతే ఫిజిక్స్ టీచర్లో మూవీలో నటించడంతో పాటు ఈ చిత్రంతో దర్శకుడిగానూ మారాడు. సుముఖ తల్లి నందిత యాదవ్ కూడా దర్శకురాలే కావడం విశేషం. సుముఖ భార్య మైత్రీ ఇంటీరియర్ డిజైనర్‌గా రాణిస్తోంది.
చదవండి: 10 ఏళ్లుగా ట్రోలింగ్.. నయన్‌ను కాదు, నన్ను ఆడేసుకుంటున్నారు
Tags : 1