నాడు జేఈఈ ఫెయిల్యూర్‌ ఇవాళ ఏకంగా యూట్యూబ్‌లో..!

Published on Sun, 04/05/2026 - 17:55

ఐఐటీ జేఈఈలో ఫెయిల్‌ అయ్యి యూట్యూబ్‌లో ఉ‍ద్యోగం సంపాదించే రేంజ్‌కు చేరుకున్న జర్నీని సోషల్‌ మీడియా వేదిక షేర్‌ చేసుకున్నాడు ఓ భారత సంతత వ్యక్తి. అందుకు ఇద్దరు మహిళలు కారణమంటూ తన కథను పంచుకున్నాడు. అతడి కథ ప్రతిఒక్కరిని కదలించింది. 

హ్యూమన్స్ ఆఫ్ బాంబే' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేసుకున్న పోస్ట్‌లో అభిజయ్‌ అరోరా అనే వ్యక్తి తన కథను షేర్‌ చేసుకున్నారు. తన తల్లి ప్రభుత్వ ఉద్యోగిగా నగరాలు మారుతూ..తనను, తన చెల్లిని ఎలా పెంచిందో గుర్తుచేసుకున్నారు. సింగిల్‌ మదర్‌గా ఆమె పడ్డ కష్టం మర్చిపోలేనంటున్నాడు. కేజీ తరగతుల నుంచి ఐఐటీ ప్రవేశ పరీక్ష వరకు ప్రతి దశలోనూ తన తల్లి తనకు ఎలా సహాయం చేసిందో గుర్తు చేసుకున్నాడు. జేఈఈ టైంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి టీ పెట్టి ఇచ్చేదని అన్నారు. అంతలా ఆమె కష్టపడ్డా..ఫెయిల్‌ అవ్వడంతో తన ఆశయాలన్నీ నీరుగారిపోయాయని బాధగా చెప్పుకొచ్చాడు. 

నిజానికి ఆ ఓటమి అమ్మ త్యాగాలకి చేసిన ద్రోహంగా అనిపించేది, అందుకే మరో మార్గంలో ఎలాగైన సక్సెస్‌ అందుకోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యానని రాసుకొచ్చాడు పోస్ట్‌లో. ఐఐటీ బెంగళూరులో హ్యాకథాన్‌లో గెలిచి మలేషియాలో ఉద్యోగం సంపాదించినట్లు చెప్పుకొచ్చాడు. బాగా సంపాదిస్తున్నప్పటికీ అదంత సంతృప్తినివ్వకపోవడంతో గూగుల్‌లో పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోరా పంచుకున్నాడు. తన అవకాశాలను మెరుపరుచుకోవడానికి ఐవీ లీగ్ ఎంబీఏ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. 

ఐఐటి నేపథ్యం లేకుండా హార్వర్డ్ అసాధ్యమని కన్సల్టెంట్లు నవ్వారని నాటి పరిస్థితిని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఆ సందేహాలన్నింటిని పక్కనపెట్టి తన కలను సాకారం చేసుకోవడానికి రూ. కోటి రూపాలయ రుణం తీసుకున్నాడు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఉద్యోగం కోసం పెద్ద పోరాటమే చేశానంటున్నాడు. ఉద్యోగం సంపాదించడానికి, దేశం విడిచి వెళ్లిపోవడానికి తన వద్ద 90 రోజుల సమయమే ఉన్న క్లిష్టతరమైన ఉద్యోగ మార్కెట్‌ని ఎదుర్కొన్నట్లు తెలిపాడు. తాను వారానికి వంద ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా..జాబ్‌ సంపాదించలేకపోయానని చెప్పుకొచ్చాడు. అప్పుడే తన జీవితానికి రెండో ఆధారంగా తన భార్య రంగప్రవేశం చేసిందని చెప్పుకొచ్చాడు. 

తనను నిరుద్యోగిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, కొండంత తిరస్కరణల నడుమ అండగా నిలబడి తన కుటుంబాన్ని ఒంటరిగా పోషించిందని రాసుకొచ్చాడు పోస్ట్‌లో. ఆమెకు తనపై ఉన్న నమ్మకమే తనను ఆవిష్కరణలు చేసేలా పురికొల్పిందని పేర్కొన్నాడు. అంతేగాదు అరోరా తన రెజ్యూమ్‌ని మెరుగుపరుచుకోవడానికి ఒక ఏఐ ఆధారిత సాధానాన్ని రూపొందించి ఉద్యోగ దరఖాస్తులకు సంబంధించిన కంటెంట్‌ను పంచుకోవడం ప్రారంభించారు. 

చివరికి అరోరా చేసిన పని గూగుల్ దృష్టిని ఆకర్షించింది. అలా ఆయన గూగుల్‌లో​ యూట్యూబ్‌లో ప్రొడక్ట్‌ మేనేజర్‌ జాబ్‌ పొందారు. ఆ ఫ్లాట్‌ఫాంలో ఆరు లక్షలకు పైగా ఫాలోవర్లతో ఒక కమ్యూనిటీనే ఏర్పరుచుకున్నట్లు వెల్లడించారు. ఆయన ఏఐ రంగంలోని సిలికాన్ వ్యాలీ నాయకులతో ఒక పాడ్‌కాస్ట్‌ను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు తన తల్లిన కూడా గూగుల్‌ కార్యాలయానికి తీసుకువెళ్లానని పంచుకున్నారు. తన డెస్క్‌ గోడలపై యూట్యూబ్‌ లోగోని కన్నీళ్లతో అమ్మ తన వంక గర్వంగా చూసిన క్షణం మర్చిపోలేనంటూ భావోద్వేగంగా రాసుకొచ్చాడు. 

ఆ క్షణంలో తాను ఎదుర్కొన్న తిరస్కారాలు, నిద్రలేని రాత్రల కష్టం ఫలించదన్న ఆనందం కలిగిందన్నారు. తన విజయవంతమైన జర్నీని వివరిస్తూ..ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుందని అంటుంటారు. కానీ తనకు ఇద్దరు మహిళలు ఉండటం అదృష్టం అని రాసుకొచ్చాడు. తనకు ఆరంబాన్ని ఇవ్వడం కోసం సర్వ త్యాగం చేసిన తల్లి, అలాగే తన ప్రస్థానాన్ని పూర్తి చేయడానికి సర్వ పణంగా పెట్టిన భార్య, ఈ ఇద్దరు లేకపోతే తాను లేనని అన్నారు. 

"ఈ కథ హృదయానికి హత్తుకునేలా ఉంది. నిజానికి విజయం కష్టానికి ప్రతిఫలమే అయినా..దాని వెనుకు మన ప్రియమైన వ్యక్తుల నిశబ్ద బలం, త్యాగం, ప్రోత్సహం కచ్చితంగా ఉంటాయన్నది మీ కథ నొక్కి చెబుతోంది అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు". నెటిజన్లు.

 

(చదవండి: నొప్పులు పడుతూ కోర్టుకి హాజరు..! కారణం తెలిస్తే షాకవ్వుతారు)

 

Videos

నువ్వు ఏడ్చే రోజు దగ్గర్లోనే ఉంది.. ABN రాధాకృష్ణను ఏకిపారేసిన నాగార్జున యాదవ్

విశాఖ జిల్లాలో యువకుడి ప్రాణం తీసిన క్రికెట్

దళితుడుపై చెయ్యి చేసుకున్నాడు.. అయ్యన్నపాత్రుడు చెంప చెళ్లుమనిపించిన సుధాకర్ బాబు

నా తండ్రిని నేను చంపుకుంటానా.. పేర్ని నాని ఎమోషనల్

దువ్వాడలో దారుణం.. మహిళ ఇంటికి నిప్పు పెట్టిన దుండగుడు

చిల్లర చేతిలో పెట్టి మెడలో చైన్ లాక్కెళ్లిన దొంగోడు

5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం

ఇరాన్, అమెరికా బాంబుల వర్షం.. ఒక్కడి కోసం సమస్త సైన్యం

లోకేష్ ను నమ్మి మోసపోయా

విడాకులు రాగానే సంబరాలు.. డప్పులతో బిడ్డకు స్వాగతం

Photos

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

+5

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్‌ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో దర్శకుడు అట్లీ భార్య (ఫోటోలు)

+5

సింహాచలం : దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..? (ఫొటోలు)