Breaking News

మొన్న పెట్రోల్.. నేడు సీఎన్‌జీ: పెరిగిన ధరలు!

Published on Sat, 04/04/2026 - 16:50

పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తరువాత ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇంధన ధరలు పెరిగాయి. గ్యాస్ కొరత ఏర్పడింది.ఇలాంటి సమయంలో మన దేశంలోని టొరెంట్ గ్యాస్ సంస్థ జైపూర్‌లో కేజీ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరను రూ.2.50 పెంచింది. దీంతో వినియోగదారులపై పెరుగుతున్న వ్యయ భారం మరింత పెరిగింది. ఇంధన ధరలలో విస్తృతమైన పెరుగుదల సవరణల మధ్య ఈ పెంపు చోటుచేసుకుంది, ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్లు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు కూడా పెరిగాయి.

ఎల్‌పీజీ ధరలు
సీఎన్‌జీ ధరల పెంపుతో పాటు, చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రధాన నగరాల వ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి. ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.195.50 పెరిగి రూ.2,078.50కి చేరింది. 5 కేజీల చిన్న సిలిండర్ల ధరలు కూడా రూ.51 మేర పెరిగింది. కోల్‌కతాలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరలు ఏకంగా రూ.218 మేర పెరిగాయి.

ధరలు పెరుగుదలకు కారణం!
మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రపంచ మార్కెట్ పోకడల ఆధారంగా వాణిజ్య ఎల్‌పీజీ ధరలను నెలవారీగా సవరిస్తారు. తాజా ధరల పెంపునకు కారణం.. సౌదీ కాంట్రాక్ట్ ధరలో 44% భారీ పెరుగుదలే అని తెలుస్తోంది. ఈ ధర మార్చిలో మెట్రిక్ టన్నుకు 542 డాలర్ల నుంచి ఏప్రిల్‌లో మెట్రిక్ టన్నుకు 780 డాలర్లకు పెరిగింది. ఎల్‌పీజీ సరఫరా తగ్గిపోవడం కూడా సిలిండర్ ధరలు పెరగడానికి కారణం అవుతోంది.

ఇదీ చదవండి: ఐఫోన్ కొనేందుకు ఇది మంచి సమయం!

Videos

ఇక అమెరికా పనైపోయింది..? ఈ యుద్ధం ఆగదు..

ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఇకపై FORM 16 ఉండదు..

మీ సైజ్ ఎంత.. చెప్పు చూపించి ఇచ్చిపడేసిన అదా శర్మ...

గజ్వేల్‌లో టెన్షన్ టెన్షన్ KCR క్యాంప్ కార్యాలయంపై దాడి

ప్రజల కోసం అసెంబ్లీ నక్సలైట్ అవుతా

నాగేంద్రను స్టేషన్ కు పిలిచి విచారించాలి

ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నేలమట్టం! ఇరాన్ షాకింగ్ ప్రకటన

SHOCKING CCTV FOOTAGE: వామో ఏంటి ఇది కొట్టులో విక్స్ కొనడానికి వచ్చి...

వెంకన్న స్వామిపై భక్తి కంటే BR నాయుడుపై చంద్రబాబుకు ప్రేమ ఎక్కువ

రోడ్లు ఖాళీ ఎండ దెబ్బకు.. లాక్ డౌన్ పరిస్థితి

Photos

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

+5

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్‌ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో దర్శకుడు అట్లీ భార్య (ఫోటోలు)

+5

సింహాచలం : దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..? (ఫొటోలు)

+5

‘బైకర్‌’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

నేపాల్ ట్రిప్‌లో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ (ఫొటోలు)

+5

డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)