ఇక అమెరికా పనైపోయింది..? ఈ యుద్ధం ఆగదు..
Breaking News
ఇండక్షన్ హీటర్లపై కేంద్రం ఫోకస్!
Published on Sat, 04/04/2026 - 16:09
పశ్చిమాసియా సంక్షోభంతో ఎల్‌పీజీ లభ్యతపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఇండక్షన్ హీటర్లు, వాటికి అనువుగా ఉండే ఇతరత్రా పాత్రల వాడకాన్ని ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఇందుకోసం ఉత్పత్తిని పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉత్పత్తి కంపెనీలతో శుక్రవారం చర్చలు జరిపింది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సారథ్యంలో జరిగిన సమావేశంలో విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ లవ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఇండక్షన్ హీటర్లు, కుక్కర్లలాంటి పాత్రల తయారీని వేగవంతం చేసేందుకు, ఉత్పత్తి పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఇందులో చర్చించినట్లు వివరించారు. ఈ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని, హాట్ కేక్‌ల్లాగా అమ్ముడవుతున్నాయని పేర్కొన్నారు.
Tags : 1