ఇక అమెరికా పనైపోయింది..? ఈ యుద్ధం ఆగదు..
Breaking News
సూపర్ స్టార్ రజనీకాంత్ పేరెంటింగ్ టిప్స్..!
Published on Sat, 04/04/2026 - 15:17
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఐదు దశాబ్దాలకుపైగా సుమారు 170 సినిమాల్లో నటించారు. ఇందులో కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం మొదలైన భాషల సినిమాలు ఉన్నాయి. తన నటనతో, స్టైల్‌తో ఎంతోమంది అభిమానుల మనసుదోచుకున్న ఈయన ఏడు పదులు వయసుదాటినా..అభిమానులను అలరించేలా యంగ్ హీరోల మాదిరిగా స్టెప్పులు వేస్తూ నటిస్తుండటం విశేషం. సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకోవడం తోపాటు అటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ మంచి తండ్రిగా మన్నననలను అందుకున్నారు.
రజనీకాంత్, భార్య లత దంపతులకు ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన కుమార్తెలు కూడా ఇప్పటికే చిత్ర పరిశ్రమలో దర్శకులుగా, నిర్మాతలుగా కళాకారిణులుగా స్థిరపడ్డారు. ఆయన ఆడిపిల్లలు అనే తారతమ్యం చూపకుండా నచ్చిన రంగంలోకి వచ్చే స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా తండ్రిగా అన్ని విధాలుగా సపోర్టు చేస్తూ..నాన్న అనే పదానికి గొప్ప అర్థం ఇచ్చారాయన. అలాంటి సూపర్‌స్టార్ నుంచి నేర్చుకోవాల్సిన పేరెంటింగ్ పాఠాలేంటో తెలుసుకుందామా..!
పిల్లల వ్యక్తిత్వాన్ని గౌరవించడం..
తల్లిదండ్రులు పిల్లల జీవితాన్ని నియంత్రించడానికి బదులుగా సొంత మార్గాన్ని ఎంచుకునేలా కుమార్తెలను ప్రోత్సహించారు రజనీ. ఇక్కడ పిల్లలను ఫలానా చేయమని డైరెక్షన్ ఇవ్వడం లేదా బలవంతం చేయడం వంటివి చేయకూడదు. వారి భావనలు, ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని గౌరవించాలి.
అందులో ఉండే సాధకబాధలు అర్థమయ్యేలా వివరించాలే తప్ప..నిర్బంధించకూడదు. ఇక్కడ మంచి తండ్రిగా రజనీ తన కుమార్తెల విషయంలో అదే చేశారు. ముఖ్యంగా పిల్లలను అర్థం చేసుకోవాలని నొక్కి చెబుతున్నారు రజనీ.
పిల్లలతో సన్నిహితంగా ఉండటం..
అతిముఖ్యమైన పేరెంటింగ్ పాఠం పిల్లలతో అత్యంత సాన్నిహిత్యంగా ఉండటం. ఇక్కడ నటుడు రజనీకాంత్ తన కుమార్తెలు, కుటుంబంతో చక్కటిన సత్సంబంధాలను నెరుపుతారు. తల్లిదండ్రులు పిల్లలతో మంచి కమ్యూనికేషన్ ఉంటేనే వాళ్లు తాము అత్యంత సురక్షితంగా ఉన్నామనే భావన ఏర్పడుతుంది.
అలాగే తల్లిదండ్రులపై మంచి నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. స్ట్రిక్ట్‌గా ఉండటం కంటే..పిల్లలతో స్నేహపూర్వకంగా మెలిగే పెంపకమే మంచిదని చెబుతున్నారు మానసిక నిపుణులు.
పిల్లల డ్రీమ్స్‌కి మద్దతివ్వండి..
రజనీ కూతుళ్లు ఇద్దరు సినీ రంగాన్నే ఎంచుకున్నారు. చిత్రపరిశ్రమలో తమకంటూ మంచి కెరీర్‌ని నిర్మించుకున్నారు. రజనీకాంత్ తన పిల్లల కలలకు, ఆశయాలకు మద్దతిచ్చారు. పిల్లల కోసం అన్నీ చేయడం పెంపకం కాదు, కష్ట సమయాల్లో పిల్లలకు అండగా నిలవడం, వారి పక్కన ఉండటమే అసలైన పెంపకం.
అంతేగదు పిల్లల కలలకు, ఆశయాలకు మద్దతిచ్చినప్పుడే పిల్లలు స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. ఆధనిక తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పెంపక పాఠం.
కుటుంబానికే తొలి ప్రాధాన్యత..
అలాగే పేరెంట్స్ తమ తమ ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉన్నా..కుటుంబానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ సూపర్‌స్టార్ రజనీ నుంచి నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పేరెంటింగ్ పాఠం ఇది. ఆయన నటుడిగా బిజీగా ఉన్నా..కుటుంబంతో గడిపే సమయానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని ఆయనే స్వయంగా పలుమార్లు చెప్పారు కూడా.
కుటుంబమే లేకుంటే మనం లేం, అందువల్ల మొదటి ప్రాధాన్యత ఫ్యామిలీకే ఇవ్వండి అప్పుడే ఎందులోనైనా సక్సెస్ అవ్వగలం అని చెబుతున్నారు రజనీ.
Tags : 1